పెళ్లై నెలరోజులైనా కుదరని సఖ్యత.. నవవధువు.!
పెళ్లై నెలరోజులైనా నవదంపతుల మధ్య సఖ్యత కుదరలేదు. వధువుకి ఇష్టం లేని పెళ్లి చేశారని.. అందుకే ఆమె తనతో సరిగ్గా ఉండడం లేదంటూ అల్లుడు మామాకి చెప్పాడు. మరుసటి రోజే ఆమె చేసుకుంది. అయితే అత్తింటి వేధింపుల కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడిందంటూ వధువు బంధువులు శివాలెత్తారు. నవవరుడి ఇంటిపై దాడి చేసి తగలబెట్టారు. వధువుపై ఆత్మహత్యపై పరస్సర ఆరోపణలు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటన జిల్లాలో జరిగింది. కుప్పం మండలం మంకలదొడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాసులు కుమార్తె చైతన్య(22) అదే గ్రామంలో వాలంటీర్‌గా పనిచేస్తోంది. గత నెల 28న సమీపంలోని ఉర్లవోబనపల్లె పంచాయతీ పరిధిలోని కుర్మానపల్లెకి చెందిన వెంకటేష్ కుమారుడు తంగవేల్(24)తో వివాహం జరిపించారు. పెళ్లై నెల రోజులు గడుస్తున్నా నవ దంపతుల మధ్య సఖ్యత కుదరలేదు. రెండు రోజుల కిందట అనూహ్యంగా బాత్రూమ్‌లో నవవధువు చైతన్య ఆత్మహత్య చేసుకుంది. అల్లుడి వేధింపుల కారణంగానే ఉరేసుకుందన్న ఆగ్రహంతో ఆమె కుటుంబ సభ్యులు తంగవేల్‌పై దాడి చేసి చితకబాదారు. మృతదేహాన్ని మంకలదొడ్డికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. కూతురు చనిపోయిందన్న కోపంతో మరుసటి రోజు ఆమె కుటుంబ సభ్యులు కుర్మానపల్లె వచ్చి తంగవేల్ ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు. కిటికీలు, తలుపులు పగలగొట్టి.. ఫర్నీచర్‌ని పెట్రోల్ పోసి తగలబెట్టి బీభత్సం సృష్టించారు. Also Read: అయితే వధువుకి ఇష్టం లేని పెళ్లి చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెళ్లై నెలరోజులైనా భర్తతో సఖ్యంగా ఉండలేదని.. ఆమె తనను కనీసం దగ్గరకు రానీయడం లేదంటూ అల్లుడు తంగవేల్ మామ శ్రీనివాసులుకు చెప్పాడని తెలుస్తోంది. ఆ మరుసటి రోజే ఆమె అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. వధువు ఆత్మహత్యతో పెళ్లి ఇల్లు రణరంగంగా మారింది. పరస్పర ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మూకుమ్మడి దాడితో గ్రామంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. Read Also:
By November 28, 2020 at 09:51AM
No comments