Prakash Raj పనికిమాలిన కుసంస్కారి.. ఒళ్లుపొంగి వాగితే.!: నాగబాబు సంచలన కామెంట్స్
పవన్ కళ్యాణ్ పూటకో పార్టీ మార్చే ఊసరవెల్లి.. బీజేపీకి మద్దతు ఇవ్వాలంటే.. ఇక, జనసేన ఎందుకు? ఇంకొకరి భుజాన ఎక్కి ఈ రాజకీయాలు ఎందుకు? ప్రజలారా.. ఈసారి మీరే ఇలా వచ్చిన వారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపాలి. వీళ్లకే కాక, వీళ్ల వెంట వెళ్లిన మన వారికి కూడా బుద్ధి చెప్పాలి అంటూ ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. GHMC ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు తెలిపిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ విధానాలను తప్పుపట్టారు ప్రకాష్ రాజ్. అయితే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలతో జనసైనికులు ఆగ్రహిస్తున్నారు. ప్రకాష్ రాజ్‌ని ఏకిపారేస్తుండగా.. ఈ విలక్షణ నటుడికి మద్దతు తెలిపేవారు చాలా మందే ఉన్నారు. ఈ తరుణంలో మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు.. ప్రకాష్ రాజ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు కోసమే.. ప్రకాష్ పనికిమాలిన కుసంస్కారి అని.. డబ్బుకోసం నిర్మాతల్ని హింసకు గురిచేస్తాడంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు. నాగబాబు ఏమన్నారంటే.. ‘రాజకీయాల్లో నిర్ణయాలు అనేకసార్లు మారుతూ ఉంటాయి.. బట్ ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశ్యం లాంగ్ టర్మ్‌లో ఒక పార్టీకి ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు అయితే చాలా మంచిది. మా నాయకుడు పవన్ కళ్యాణ్.. GHMC ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ ఇచ్చి బీజేపీ గెలుపుకి కృషి చేయడం వెనుక ప్రజా ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు ఉన్నాయని మా నమ్మకం. ఎవడికి పవన్ ఖళ్యాణ్ ద్రోహం చేశాడని ప్రతి పనికిమాలినవాడు విమర్శిస్తున్నాడు. సుబ్రహ్మణ్యం స్వామి నిన్ను తొక్కి నారతీస్తుంటే మిస్టర్ ప్రకాష్ రాజ్ నీ రాజకీయ డొల్లతనం ఏంటో బీజేపీ లీడర్ సుబ్రహ్మణ్యస్వామి డిబేట్‌లోనే అర్థం అయ్యింది. సుబ్రహ్మణ్యం స్వామి నిన్ను తొక్కి నారతీస్తుంటే మాట్లాడలేక తడబడటం నాకు ఇంకా గుర్తుంది. నీ ఉద్దేశ్యంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాలు నీకు ఇష్టం లేకపోతే విమర్శించు తప్పులేదు. అలాగే బీజేపీ గాని మరే ఇతర పార్టీ గాని ప్రజలకు మంచి చేసినా హర్షించగలగాలి. విమర్శించడం తప్ప మంచి చేస్తే మెచ్చుకోలేని నీ కుసంస్కారం గురించి ఏమి చెప్పగలను. ఒకటి మాత్రం చెప్పగలను. ఈ దేశానికి బీజేపీ లాంటి పార్టీతో ఏపీకి జనసేన పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. నీ లాంటి కుహనా మేధావులు ఎన్ని వాగినా బీజేపీ జనసేన కూటమి శక్తిని ఎవరూ ఆపలేరు. డబ్బు కోసం ఎంత హింసపెడతావో.. నిర్మాతలని ఎన్ని రకాలుగా డబ్బుకోసం హింస పెట్టావో.. ఇచ్చిన డేస్ట్‌ని క్యాన్సిల్ చేసి ఎంత హింసకి గురిచేశావో.. ఇంకా గుర్తున్నాయి ప్రకాష్ రాజ్. ముందు నువ్వు మంచి మనిషిగా తయారయ్యి అప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఒక మంచి మనిషి.. నిస్వార్థపరుడైన నాయకుడిని విమర్శించు. డైరెక్టర్స్‌ని కాకా పట్టి నిర్మాతల్ని కాల్చుకుతిన్న నీకు ఇంతకన్నా మంచిగా మట్లాడ్డం ఏమి తెలుసు. బీజేపీ నాయకత్వాన్ని నువ్వు నోటికొచ్చినట్టు విమర్శించినా నిన్ను ఎవరూ ఏమీ అనలేదంటే అది బీజేపీ ప్రజాస్వామ్యానికి ఇచ్చేవిలువ అని అర్థం చేసుకో. బీజేపీ జనసేన GHMC ఎలక్షన్స్‌లో ఖచ్చితంగా తమ సత్తా చాటుకోబోతున్నాయి. మీడియా అడిగింది అని ఒళ్లు పొంగి నీ పనికిమాలిన రాజకీయ డొల్లతనాన్ని బయటవేసుకోకు’ అంటూ ప్రకాష్ రాజ్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చారు జనసేన నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు.
By November 28, 2020 at 09:51AM
No comments