కూతురి పెళ్లి చూసి కోమాలోకి.. విశాఖలో విషాదం

కన్నకూతురి పెళ్లి చూడాలన్న కోరికతో ప్రాణం నిలబెట్టుకున్నాడు. ఆపరేషన్ చేయించుకుని ఇంటికొచ్చి చివరి కోరిక నెరవేర్చుకున్నాడు. కూతురి పెళ్లి కళ్లారా చూసిన కొద్దిసేపటికే కోమాలోకి వెళ్లిపోయి ప్రాణాలు విడిచాడు. ఈ అత్యంత విషాద ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని అచ్యుతాపురం మండలం చోడపల్లికి చెందిన నారాయణరావు గుండెజబ్బుతో బాధపడుతూ ఇటీవల ఆపరేషన్ చేయించుకున్నాడు. మూడు నెలలుగా విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నారాయణరావుకు ఇద్దరు కుమార్తెలు. చిన్నకూతురి వివాహం జరిపించాలన్నదే తన చివరి కోరిక. ఆయన కోరిక మేరకు రాంబిల్లి మండలం లాలంకోడూరుకి చెందిన అతని మేనల్లుడితో కూతురు వివాహం నిశ్చయించారు. ఆయన సమక్షంలోనే ఇద్దరికీ వివాహం జరిపించారు. కూతురి వివాహం కళ్లారా చూసిన నారాయణరావు ఆ రోజు రాత్రే కోమాలోకి వెళ్లిపోయి ప్రాణాలు విడిచాడు. తన చివరి కోరిక నెరవేర్చుకునేందుకు ప్రాణాలు నిలబెట్టుకున్న నారాయణరావు.. ఆ కోరిక తీరగానే కోమాలోకి వెళ్లిపోయి మృతి చెందడం కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది. Also Read:
By November 03, 2020 at 11:05AM
No comments