రూ.200 కోసం భార్యని చంపేశాడు.. గుంటూరులో దారుణం

రెండొందల కోసం కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసిన దారుణ ఘటన జిల్లాలో జరిగింది. అమృతలూరు మండలం యలవర్రుకి చెందిన మండే సామ్యేలు, ఎఫ్రాయమ్మ(90) దంపతులు. వారికి ఆరుగురు సంతానం. ఎఫ్రాయమ్మకు నెలనెలా వృద్ధాప్య పింఛను వస్తోంది. ఒకటో తేదీ పింఛను తీసుకున్న భార్యను రెండొందలు ఇవ్వాలని సామ్యేలు అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో కోపంతో రగిలిపోయాడు. రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో కర్రతో తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By November 03, 2020 at 10:19AM
No comments