Breaking News

కృష్ణ ఫ్యాన్స్ వార్నింగ్... బాలకృష్ణ పక్కన ఛాన్స్ వదులుకున్న మహేశ్‌బాబు సోదరి


సూపర్‌స్టా్ర్ కృష్ణ కుమార్తె, మహేష్‌ బాబు సోదరి మంజుల నిర్మాతగా, నటిగా ప్రేక్షకులకు సుపరిచితమే. ‘షో’, ‘కావ్యాస్‌ డైరీ’, ‘ఆరెంజ్‌’ తదితర చిత్రాల్లో నటించిన ఆమె దర్శకురాలుగానూ టాలెంట్ నిరూపించుకున్నారు. అయితే మంజులకు ఓ స్టార్ హీరో సినిమా హీరోయిన్‌గా ఛాన్స్ దక్కిన విషయం మీకు తెలుసా? అయితే కొన్ని కారణాల ఆ అవకాశాన్ని ఆమె స్వయంగా వదులుకోవాల్సి వచ్చింది. హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ‘టాప్‌హీరో’ గుర్తుంది కదా. ఈ సినిమాలో బాలయ్య సరసన నటించేందుకు ముందుగా మంజులనే ఎంపిక చేసింది చిత్ర యూనిట్. అయితే ఇందుకు కృష్ణ అభిమానులు ఒప్పుకోలేదు. మంజుల హీరోయిన్‌గా నటిస్తే ఊరుకోం అని కృష్ణ ఆఫీసుకి వెళ్లి గొడవ చేశారు. మంజుల సినిమాల్లో నటించదని కృష్ణ అధికారిక ప్రకటన చేసేవరకు ఫ్యాన్స్ అక్కడి నుంచి కదల్లేదు. Also Read: ఈ విషయంపై మంజుల ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘వాళ్ల సోదరిని, ఇంటి ఆడపడుచుని అనుకుని నేను నటించేందుకు అడ్డు చెప్పారు తప్ప.. అంతకు మించి ఏం లేదు’ అని ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. తన తండ్రి అభిమానులు అడ్డు పడటంతో మంజుల హీరోయిన్‌గా పరిచయం కాలేకపోయింది. అయితే కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో మెరిసి నటన తన రక్తంలోనే ఉందని, తండ్రికి తగ్గ తనయ అని నిరూపించుకున్నారు మంజుల. ఆ తర్వాత టాప్‌హీరో సినిమాలో సౌందర్యకు ఛాన్స్ దక్కింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.


By November 05, 2020 at 10:38AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hero-krishna-daughter-manjula-losed-heroine-chance-in-balakrishna-top-hero-movie/articleshow/79054854.cms

No comments