కమల్ హాసన్ పాత్రలో మెరిసిన రాశి.. ఆ సినిమాలో ముగ్గురు స్టార్ హీరోలు

వెండితెరపై బాలనటిగా అడుగుపెట్టి హీరోయిన్‌గా అనేక మంది హీరోల పక్కన నటించారు రాశి. ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో పూర్తిగా కనుమరుగయ్యారు. అప్పుడప్పుడు చిన్నచిన్న పాత్రల్లో కనిపిస్తున్నా అవన్నీ ఆమె రీఎంట్రీకి సరైన గుర్తింపు ఇవ్వడం లేదు. అసలు విషయానికొస్తే.. రాశి బాలనటిగా చాలా సినిమాల్లో నటించారు. అలా ఓ హిందీ చిత్రంలో కమల్ హాసన్ చిన్ననాటి పాత్రలో నటించింది రాశి. Also Read: బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, తమిళ టాప్ హీరోలు కమల్ హాసన్, రజినీ కాంత్‌తో ‘గిరఫ్తార్’ సినిమా తెరకెక్కింది. అందులో కమల్ హాసన్ చిన్న వయసులోనే తండ్రి చనిపోతే తల్లిని పట్టుకుని ఉండే సన్నివేశం అది. రాశిది చాలా చిన్న వయసు కావడంతో కెమెరా ముందు ఎలా ఉండాలో కూడా ఆమెకు తెలీదు. చుట్టూ ఉన్నవారిని చూసి కంటతడి పెట్టుకుందట. తల్లి పాత్రలో నటిస్తున్న మహిళ ఎత్తుకుంటే అమ్మ కావాలంటూ గట్టిగా ఏడ్చేసిందట. ఎంత బుజ్జగించినా ఏడుపు ఆపకపోవడంతో ఆమె తల్లితోనే ఆ పాత్ర పోషించారు. ‘అలా తన అమ్మ కూడా ఆ సినిమాలో నటించింది’ అని రాశి ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. Also Read:
By November 05, 2020 at 09:32AM
No comments