ప్రియురాలిపై అనుమానంతో ప్రియుడి ఘాతుకం.. భువనగిరిలో దారుణం
పెళ్లైన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడు ఆమె మరొకరితో చనువుగా ఉంటోందని అనుమానం పెంచుకున్నాడు. అదే విషయమై ఆమెతో గొడవపడి అతి కిరాతకంగా చేశాడు. ఈ అత్యంత దారుణ ఘటన జిల్లాలో జరిగింది. జగిత్యాల జిల్లా దేవరుప్పల మండలానికి చెందిన లక్ష్మి(35) భర్త కొద్దికాలం కిందట మరణించాడు. ఆమెకు హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న కుమార్‌తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమెకు విజయ్ అనే మరో యువకుడితోనూ అక్రమ సంబంధం ఉందని కుమార్ అనుమానించేవాడు. ఆ విషయం తేల్చుకోవాలని భావించిన కుమార్.. ఆమెను నమ్మకంగా వరంగల్ - హైదరాబాద్ రహదారికి సమీపంలో భువనగిరి బైపాస్ పక్కనున్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక విజయ్ గురించి ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. Also Read: దీంతో ఆగ్రహం చెందిన కుమార్ ఆమె గొంతుకోసి కిరాతకంగా హత్య చేశాడు. బండరాయితో తలపై మోది.. బ్లేడుతో ఆమె గొంతుకోసి చంపేశాడు. అనంతరం భువనగిరి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. నిందితుడి సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Read Also:
By November 13, 2020 at 09:47AM
No comments