జగిత్యాలలో దంపతుల ఆత్మహత్య.. కారణమదేనా.?
జగిత్యాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. పట్టణంలోని శివ వీధికి చెందిన గంజి రాంబాబు(49), లావణ్య(47) ముంబైలో ఓ యాడ్ ఏజెన్సీలో పనిచేసేవారు. పది నెలల కిందట రాంబాబు తండ్రి అనారోగ్యంతో మరణించడంతో వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇల్లు విక్రయించేందుకు సోదరులతో రాంబాబు మాట్లాడినట్లు సమాచారం. ఆ విషయమై గొడవలు జరగడంతో మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. వివాహమై 25 సంవత్సరాలు గడుస్తున్నా సంతానం లేకపోవడం కూడా మరింత కుంగదీసి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల ఇద్దరికీ కరోనా సోకిందని.. అప్పటి నుంచి తలుపులు వేసుకుని బయటకు రావట్లేదని తెలుస్తోంది. Also Read: ఇంట్లో అద్దెకు ఉంటున్న వారు వెళ్లి చూడడంతో ఇద్దరూ ఫ్యానుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దంపతుల ఆత్మహత్యకు కరోనా కారణమా? లేక ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నారా? కుటుంబ సభ్యులతో గొడవలు, సంతానం లేరన్న బాధతోనే ప్రాణాలు తీసుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దంపతుల ఆత్మహత్య స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Read Also:
By November 13, 2020 at 10:18AM
No comments