మాకు పండగ లేదా... ‘వకీల్ సాబ్’ యూనిట్‌పై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం
పవర్ స్టార్ నటిస్తున్న ‘’ సినిమా షూటింగ్ శరవేశంగా జరుపుకుంటోంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ యూనిట్‌తో జత కలవడంతో వీలైనంత త్వరగా షూటింగ్ పార్ట్ పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఆయన ఫ్యాన్స్ దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దీనికి తోడు హిందీలో సంచలన విజయం సాధించిన ‘పింక్’ మూవీకి రీమేక్ కావడంతో దీనికి మరింత హైప్ క్రియేట్ అవుతోంది. Also Read: ఓ వైపు ‘వకీల్ సాబ్’ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటే.. చిత్ర యూనిట్ చేస్తున్న పనులతో వారికి చిర్రెత్తుకొస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ వదిలిన తర్వాత మరే అప్‌డేట్ రాకపోవడంతో వారు నిరాశకు గురవుతున్నారు. మొన్న దసరా.. ఇప్పుడు దీపావళి.. ఇలా పండుగల సందర్భంగా ఇతర హీరోల సినిమాలకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్ వస్తుంటే ‘వకీల్ సాబ్’కు సంబంధించి యూనిట్ వ్యవహరిస్తున్న తీరు ఫ్యాన్స్‌ను నిరాశ పరుస్తోంది. Also Read: ‘80 శాతం షూటింగ్ పూర్తయిందని చెబుతున్నారు. అంత ఫుటేజ్ దగ్గర పెట్టుకుని కనీసం టీజర్ కూడా విడుదల చెయ్యలేకపోతున్నారా’ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. విడుదల తేదీపై ఎలాగూ క్లారిటీ ఇవ్వడం లేదు.. కనీసం టీజర్ అయినా ఎప్పుడు వదులుతారో చెబితే సంతోషిస్తామంటూ వెటకారంగా కామెంట్లు పెడుతున్నారు.
By November 13, 2020 at 09:52AM
No comments