కేసీఆర్ ఆంధ్రోళ్లను తరిమికొడతారన్నారు.. ఇప్పుడేమైంది: పోసాని
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే ఓటేసి గెలిపించాలని కోరారు సినీనటుడు . మేయర్ పీఠం టీఆర్ఎస్‌కు దక్కితేనే హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. గతంలో హైదరాబాద్ అంటే మత కల్లోలాలే గుర్తొచ్చేవని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నగరం మత కల్లోలాలకు అడ్డుకట్ట పడిందన్నారు. ఎన్టీఆర్ తర్వాత కేసీఆర్ పాలనలోనే హైదరాబాద్ ప్రశాంతంగా ఉందన్నారు పోసాని.
గతంలో ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో పచ్చదనం అంతగా ఉండేది కాదని, కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ అంతటా పచ్చదనం పరుచుకుందని పోసాని కృష్ణమురళి అన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు కేవలం ఆంధ్రా నాయకుల మీదే కోపాన్ని ప్రదర్శించారని, ప్రజలపై కాదన్నారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే ఆంధ్రా ప్రజలను హైదరాబాద్ నుంచి తరిమికొడతారన్న అసత్య ప్రచారం చేశారని, కానీ ఈ ఆరేళ్లలో అలాంటి ఘటనలేమీ చోటుచేసుకోలేదన్నారు. Also Read: ఆంధ్రా నాయకులు ఇక్కడి నుంచి వెళ్లిపోయాక తెలంగాణలో కరెంట్ రోజంతా ఉంటోందని, రూ.లక్ష కోట్లతో దేశంలోనే గొప్పదిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ చేపట్టడం కేసీఆర్‌కే సాధ్యమైందని పోసాని అన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో వచ్చిన వరదలను అవకాశంగా తీసుకుని కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. వంద సంవత్సరాల క్రితం ఇంతకంటే పెద్ద వరద వచ్చి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. నిజాం కాలంలో చేపట్టిన డ్రైనేజీ వ్యవస్థను ఆక్రమించ భవనాలు నిర్మించుకోవడం వల్లే ఇప్పుడు వరదలు సంభవించాయని ఆరోపించారు. హైదరాబాద్ నగరం డెవలప్ కావాలంటే కేసీఆర్‌కే సాధ్యమని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలంతా ఆ పార్టీకే ఓటేసి గెలిపించాలని పోసాని కోరారు. By November 21, 2020 at 12:40PM
No comments