Breaking News

డంపింగ్ యార్డులో బంగారం ... 18 టన్నుల చెత్తలో నగల బ్యాగ్


పోయిందనుకున్న పది రూపాయలైనా మళ్లీ దొరికితే చాలా సంతోషంగా ఉంటుంది. అలాంటింది ఎక్కడో చెత్తలో పడేసిన బంగారం తిరిగి దొరికితే.. ఆ ఆనందమే వేరు. ఓ మహిళ పొగొట్టుకున్న నగల బ్యాగ్ డంపింగ్ యార్డులో దొరికింది. ఈ ఘటన మహారాష్ట్ర జిల్లా పూణెలో చోటు చేసుకుంది. ఓ వివాహిత పొరపాటున చెత్తలో పడేసిన నగల బ్యాగ్ కోసం పూణె మున్సిపల్ సిబ్బంది 18 టన్నుల చెత్తను ఎత్తాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే, దీపావళి సందర్భంగా పూజలు చేసేందుకు రేఖా సెలూకర్ అనే మహిళ తన ఇంటిని శుభ్రం చేసింది. , అనవసరమైన చెత్తను పారేసే వేళ, తన నగలున్న బ్యాగును కూడా చెత్త బండిలో పొరపాటున వేసేసింది. ఆ తర్వాత ఆమెకు అసలు విషయం గుర్తుచ్చొంది. అప్పటికే రెండు గంటలు దాటింది. దీంతో బ్యాగ్ ను చెత్తలో వేశానని గుర్తించి బోరుమంది. వెంటనే స్థానిక మునిసిపల్ అధికారిని కలిసి జరిగిన విషయం చెప్పింది. ఆ నగల్లో తన మంగళసూత్రం కూడా ఉందని మొరపెట్టుకుంది. Read More: మహిళ ఫిర్యాదుతో వెంటనే స్పందించిన అధికారులు, చెత్త తీసుకెళ్లిన బండి కోసం వెతకడం ప్రారంభించారు. అయితే అది అప్పటికే డంప్ యార్డులో చేరి, చెత్తను పారేసి వచ్చేసిందని తెలిసింది. దీంతో దాదాపు 18 టన్నులకు పైగా ఉన్నచెత్తలో ఆమె బ్యాగు కోసం వెతుకులాట ప్రారంభించారు. చివరకు ఆమె బ్యాగును మున్సిపల్ సిబ్బంది గుర్తించారు. వెంటనే రేఖకు అందించారు. దీంతో రేఖ మునిసిపల్ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పింది.


By November 15, 2020 at 09:31AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pune-woman-accidently-dumps-purse-with-jewelry-during-diwali-cleaning/articleshow/79228839.cms

No comments