Breaking News

Raviteja: ‘క్రాక్’ మళ్లీ మొదలైంది


మాస్ మహారాజ్ , శ్రుతిహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘క్రాక్’ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. డాన్ శీను, బలుపు లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత రవితేజ, గోపీచంద్‌ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో చివరి షెడ్యూల్‌ ప్రారంభమైంది. దీనితో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని యూనిట్ తెలిపింది. Also Read: త్వరలోనే పాటలు, ట్రైలర్ కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్ మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని నేర ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ ఆధ్వర్యంలో బి. మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. తమిళ నటులు సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాతల్లో కనిపించనున్నారు. తమిళంలో సూపర్‌హిట్ చిత్రాలకు ఫోటోగ్రఫీ డైరెక్టర్‌గా పనిచేసిన జికె విష్ణు ‘క్రాక్’కు సేవలందిస్తున్నారు. Also Read: వివరాలు.... కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపిచంద్ మలినేని నిర్మాత: బి మధు బ్యానర్: సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ సంగీతం: ఎస్.ఎస్.తమన్ ఛాయాగ్రహణం: జికె విష్ణు సంభాషణలు: సాయి మాధవ్ బుర్రా సహ నిర్మాత: అమ్మీ రాజు కనుమిల్లి ఎడిటింగ్: నవీన్ నూలి ఆర్ట్ డైరెక్టర్: ప్రకాష్ గా ఫైట్స్: రామ్-లక్ష్మణ్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి మేకప్: శ్రీనివాస రాజు కాస్ట్యూమ్స్: శ్వేత, నీరజ కోన స్టిల్స్: సాయి పీఆర్వో: వంశీ శేకర్ పబ్లిసిటీ డిజైనర్: వర్కింగ్ టైటిల్ శివ ప్రొడక్షన్ కంట్రోలర్: కొట్టపల్లి మురళీ కృష్ణ సహ దర్శకులు: గులాబీ శ్రీను, నిమ్మగడ్డ శ్రీకాంత్ చీఫ్ కో-డైరెక్టర్: పివివి సోమ రాజు Also Read:


By October 07, 2020 at 10:09AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/raviteja-crack-movies-shooting-resumes-today-in-rfc/articleshow/78527130.cms

No comments