Breaking News

Gabbar Singh: ఆ సినిమాతో పవన్ నా జీవితాన్నే మార్చేశారు.. అవన్నీ అబద్ధాలే: శ్రుతిహాసన్


విశ్వనటుడు కమల్‌హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కెరీర్ తొలినాళ్లలో చాలా ఇబ్బందులు పడింది. వరుస పరాజయాలతో ఐరన్‌లెగ్‌గా ముద్రపడిపోవడంతో ఆమెతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు, హీరోలు భయపడ్డారు. ఆ సమయంలో వచ్చిన ‘గబ్బర్‌సింగ్’ ఆమె జీవితాన్నే మార్చేసింది. పవన్‌‌కళ్యాణ్ డిఫరెంట్ మేనరిజంతో ఆ సినిమా బ్లాక్‌బస్టర్ సాధించి శ్రుతికి కూడా స్టార్ హోదా తీసుకొచ్చింది. అప్పటి నుంచి వరుస సక్సెస్‌లో టాప్‌ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఇటీవల ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్‌ గురించి వివరించిన శ్రుతి.. కమర్షియల్ సినిమాలపై మనసులో మాట బయటపెట్టింది. ‘నాకు కమర్షియల్ సినిమాలపై అంత ఆసక్తి ఉండదు. కొన్ని బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నేను భాగమయ్యాను. కానీ అవి నాకు నటిగా సంతృప్తి కలిగించలేదు. నాకు నచ్చిన కథలను ఎంచుకోవడంతో నిజాయతీగా వ్యవహరిస్తున్నా’ అని చెప్పుకొచ్చింది. Also Read: శ్రుతిహాసన్ వ్యాఖ్యల ఆధారంగా తెలుగులో కొన్ని మీడియా సంస్థలు రకరకాలు వార్తలు ప్రచురించడంతో వివాదం చెలరేగించింది. ‘గబ్బర్‌సింగ్’, ‘రేసుగుర్రం’ లాంటి సినిమాలను శ్రుతిహాసన్ ఇష్టపడలేదని వార్తలు రావడంతో మెగా అభిమానులు ఫీలయ్యారు. దీనిపై సోషల్‌మీడియాలో జరుగుతున్న చర్చ గురించి తెలుసుకున్న శ్రుతి తాజా ట్వీట్‌తో వివాదాదిని ముగింపు పలికే ప్రయత్నం చేసింది. ‘జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నా వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. దాని గురించి తెలుగు మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం. గబ్బర్‌సింగ్, రేసుగుర్రం సినిమాల్లో నటించినందుకు గర్వంగా ఫీలవుతుంటా. పవన్‌కళ్యాణ్ గారితో చేసిన ‘గబ్బర్‌సింగ్’ సినిమా నా జీవితాన్నే మార్చేసింది’ అంటూ శ్రుతి ట్వీట్‌లో పేర్కొన్నారు.


By October 07, 2020 at 09:43AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-shruthi-haasan-gives-clarity-about-gabbar-singh-movie-comments/articleshow/78526665.cms

No comments