మాజీ సీఎం కమల్‌నాథ్‌పై కేసు నమోదు
బహిరంగ సభలో కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో సహా 8మంది కాంగ్రెస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాటియా జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో సహా 8మంది కాంగ్రెస్ నాయకులు కరోనా నిబంధనలు ఉల్లంఘించి బహిరంగ సభ నిర్వహించారని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అర్వింద్ మహార్ రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై భాందర్ పోలీసులు మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో సహా 8మంది కాంగ్రెస్ నాయకులపై ఐపీసీ పలు సెక్షన్లతోపాటు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ల కింద కేసు నమోదు చేశారు. Read More: అయితే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నహర్ సింగ్ యాదవ్ భాందర్ లోని మండీలో 100 మంది ప్రజలతో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సమావేశం నిర్వహించుకునేందుకు అనుమతి తీసుకున్నారు. అయితే ఈ సభకు రెండువేల నుంచి ర2500 వరకు హాజరయ్యారు. దీంతో కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి 2,500 మందితో సమావేశం నిర్వహించారని పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 28 స్థానాల్లో ఉప ఎన్నికలు జరగతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఉప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నవంబర్ 3న పోలింగ్... 10వ తేదీన కౌంటింగ్ జరగనుంది.
By October 07, 2020 at 09:50AM
No comments