Breaking News

Prabhas: 'రాధేశ్యామ్' ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. పూజా క్యారెక్టర్ రివీల్ చేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్


ఇటీవలే 'అల.. వైకుంఠపురములో' సినిమాలో అల్లు అర్జున్‌తో చిందులేసి మంచి జోష్‌లో ఉన్న పూజా హెగ్డే.. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ సరసన '' మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో పూజా క్యారెక్టర్ చాలా కీలకం అని, అలాగే ఆమె గ్లామర్ డోస్ చిత్రానికి మేజర్ అట్రాక్షన్ అవుతుందని విన్నాం. ఈ క్రమంలో తాజాగా ఈ రోజు (అక్టోబర్ 13) పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇందులో పూజా క్యారెక్టర్ పేరు రివీల్ చేసింది చిత్రయూనిట్. ఈ పీరియాడిక్ రొమాంటిక్ లవ్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాలో పూజ హెగ్డే పేరు ప్రేరణ అని తెలుపుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో యూరప్ దేశాల వస్త్రాధారణతో, అందమైన నవ్వుతో తెగ ఆకట్టుకుంటోంది బుట్టబొమ్మ. ఆమె క్యూట్ లుక్ చూసి మురిసిపోతున్నారు ఫ్యాన్స్. కాగా ఈ మూవీలో పూజ హెగ్డే ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ క్యారెక్టర్‌లో గ్లామర్ డోస్‌తో ఆకట్టుకుంటూ, మరో క్యారెక్టర్‌లో తనదైన అభినయంతో కట్టిపడేయనుందని టాక్. Also Read: 1960 దశకం నాటి ప్రేమకథతో ఎంతో ప్రతిష్టాత్మకంగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ ‘రాధే శ్యామ్’ మూవీ రూపొందుతోంది. ప్ర‌భాస్ 20వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, ఎయిర్‌టెల్‌ భామ శాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ప్రభాస్ ప్యూర్ రొమాంటిక్ రోల్ పోషిస్తున్నారని సమాచారం. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ అతిత్వరలో ఫినిష్ చేసి విడుడల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రాధేశ్యామ్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక ఈ మూవీ పూర్తికాగానే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' సినిమా చేయనున్నారు ప్రభాస్.


By October 13, 2020 at 11:43AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/latest-update-from-prabhas-radhe-shyam-unit-on-the-occuation-of-pooja-hegde-birth-day/articleshow/78634164.cms

No comments