Breaking News

ఎన్టీఆర్‌తో 150 సినిమాల్లో కనిపించిన మహానటుడు.. బాలకృష్ణతో ఆఖరి సినిమా


తెలుగు తెరపై తొలితరంలో ఎంతోమంది తమ నటనతో ప్రేక్షకులను అలరించారు. అలాంటివారిలో మిక్కిలినేని మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి ఒకరు. రంగస్థల కళాకారుడైన ఆయన అందివచ్చిన ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయేవారు. అటు వెండితెర... ఇటు అక్షరాన్ని సమంగా ప్రేమించే ఆయన తెలుగు సినిమాకు ఓ గొప్ప వరంగా భావించవచ్చు. చారిత్రక, పౌరాణిక, సాంఘికం... ఇలా ఏ పాత్ర అయినా వంద శాతం న్యాయం చేయడమే ఆయనకు తెలుసు. Also Read: ఆంధ్రప్రదేశ్‌‌లోని గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలోని లింగాయపాలెంలో 1914, జులై 7న జన్మించారు. కోలవెన్నులో అమ్మమ్మ దగ్గర పెరిగిన ఆయన నాటకాలపై మక్కువతో రంగస్థలం వైపు మళ్లారు. సాంఘిక, జానపద, పౌరాణిక నాటకాల్లో పురుష, స్త్రీ పాత్రలను ధరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్వాత్రంత్ర పోరాటాల్లో పాల్గొని ఐదుసార్లు జైలుకు వెళ్లారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నిజాం పాలనకు వ్యతిరేకంగా కొంతకాలం పోరాడారు. అనంతరం సినిమా రంగంపై ఆసక్తితో అటువైపు వెళ్లారు. 1949లో ‘దీక్ష’ సినిమాతో సినిమా కెరీర్‌ని మొదలుపెట్టారు మిక్కిలినేని. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తండ్రి కె.ఎస్‌.ప్రకాశరావు. Also Read: నాటకాల్లో అనుభవం ఉండటంతో ఏ పాత్ర ఇచ్చినా ఆయన చెలరేగిపోయేవారు. దీంతో దర్శక నిర్మాతలు ఆయన కోసమే ప్రత్యేకంగా పాత్రలు రాసేవారు. తన కెరీర్లో 400పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేశారు. నందమూరి తారక రామరావుతోనే ఏకంగా 150 సినిమాల్లో నటించడం ఓ రికార్డుగా చెప్పొచ్చు. జానపద బ్రహ్మ విఠలాచార్య తీసిన దాదాపు ప్రతి చిత్రంలోనూ ఆయన నటించారు. మిక్కిలినేని ఆఖరి సినిమా ‘భైరవద్వీపం’. Also Read: మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి భార్య పేరు సీతారత్నం. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 2011, ఫిబ్రవరి 22న 96ఏళ్ల వయసులో మూత్ర సంబంధిత వ్యాధితో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆంధ్రా యూనివర్శిటీ ఆయన్ని కళాప్రపూర్ణ బిరుదుతో గౌరవించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రపతి పురస్కారం కూడా ఇచ్చి సత్కరించింది. ఇంకా ఎన్నెన్నో పురస్కారాలు, గౌరవాలు అందుకున్న ఆయన గర్వించదగ్గ మహానటుల్లో ఒకరిగా నిలిచారు.


By October 13, 2020 at 09:41AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mikkilineni-radhakrishna-acting-with-ntr-in-150-movies/articleshow/78632241.cms

No comments