పొద్దున్నే నిద్రలేవమన్నందుకు కొడుకు అఘాయిత్యం.. గుంటూరులో విషాదం


అమ్మ తిట్టిందని.. నాన్న మందలించాడంటూ చిన్నచిన్న కారణాలకే యువత ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి జిల్లాలో చోటుచేసుకుంది. బారెడు పొద్దెక్కినా నిద్రలేవడం లేదని తల్లిదండ్రులు మందలించినందుకు కొడుకు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వెలుగుచూసింది. ఈ ఘటన మండలం గన్నవరంలో జరిగింది. గ్రామానికి చెందిన యువకుడు అమర మహేష్(20) డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. రోజూ లేటుగా నిద్రలేవడం అలవాటైంది. బారెడు పొద్దెక్కినా నిద్ర ఏంటంటూ తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపానికి గురై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్లిన సమయంలో పురుగుల మందు తాగేశాడు. పొలం నుంచి తిరిగొచ్చిన తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో పడి ఉన్న కొడుకును చూసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మాచర్ల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా వైద్యుల పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By October 03, 2020 at 11:06AM
No comments