Breaking News

మామిడితోటలో ప్రియురాలి హత్య.. కడపలో ప్రియుడి ఘాతుకం


నమ్మివచ్చి సహజీవనం చేస్తున్న ప్రియురాలిని కిరాతకంగా చంపేశాడో దుర్మార్గుడు. అర్ధరాత్రి వేళ అమానుషంగా చంపేసి తప్పించుకు తిరుగుతున్న ప్రియుడిని జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని కలపుది గ్రామానికి చెందిన సుజాత, సమీపంలోని గిద్దలూరుకి చెందిన ప్రసాద్‌ కొద్దికాలంగా సహజీవనం చేస్తున్నారు. ఇటీవల కడప జిల్లాలోని చిట్వేలి మండలం దేవమాచుపల్లెకి మకాం మార్చారు. గ్రామానికి చెందిన ఓ రైతు మామిడితోటకి కాపలాగా ఉంటూ అక్కడే నివాసముంటున్నారు. ఈ నెల 18న అర్ధరాత్రి వేళ అనూహ్యంగా ప్రియురాలిని కిరాతకంగా హత్య చేసి ప్రియుడు ప్రసాద్ పారిపోయాడు. అమానుషంగా చంపేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న ప్రసాద్‌పై నిఘా పెట్టిన పోలీసులు చిట్వేలి బస్టాప్ వద్ద వేచి ఉండగా అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. హత్యకు గల కారణాలు విచారణలో తెలియాల్సి ఉంది. Also Read:


By October 24, 2020 at 11:56AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-held-for-killing-girlfriend-brutally-in-kadapa/articleshow/78841732.cms

No comments