Breaking News

అఖిల్ నెక్ట్స్ మూవీలో బన్నీ హీరోయిన్?


అక్కినేని వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్‌ లవర్‌బాయ్ ఇమేజ్ కోసం తాపత్రయపడుతున్నాడు. ఇప్పటికే నాలుగు సినిమాలు చేసినా సరైన సక్సెస్ దక్కకపోవడంతో భారం మొత్తాన్ని టాప్ హీరోయిన్ల మీదే వేస్తున్నాడు. అందుకే తన తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్గేను తీసుకున్నాడు. వరుస హిట్లతో టాలీవుడ్లో టాప్ హీరోయిన్‌‌గా కొనసాగుతున్న పూజాతో తన లక్ మారుతుందని గట్టి నమ్మకమే పెట్టుకున్నాడు . ఆ సినిమా షూటింగ్ దశలో ఉండగానే సురేందర్‌రెడ్డితో ప్రాజెక్టు పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో కన్నడ భామ రష్మికను హీరోయిన్‌గా తీసుకునేందుకు యూనిట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలతో రెండు బ్లాక్‌బస్టర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్న ప్రస్తుతం బన్నీ సరసన ‘పుష్ప’లో నటిస్తోంది. దీంతో రష్మికను తీసుకుంటే తన సినిమాకు హైప్ క్రియేట్ అవుతుందని అఖిల్, సురేందర్ రెడ్డి ఆలోచనగా తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.


By October 14, 2020 at 07:01AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rashmika-mandanna-may-role-in-akhil-next-film/articleshow/78651491.cms

No comments