Breaking News

నాగార్జున అలా అనడం తప్పు.. నన్ను కావాలనే ఎలిమినేట్ చేశారు: స్వాతి దీక్షిత్ మొత్తం బయటపెట్టింది


వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లిన బ్యూటీ హీరోయిన్ స్వాతి దీక్షిత్‌ను తొలివారంలోనే ఎలిమినేట్ చేయడం హాట్ టాపిక్ అవుతుంది. మొన్న దేవి.. ఆ తరువాత ఎలిమినేషన్స్ ఓటింగ్ ప్రకారమే జరిగిందా?? లేక కావాలనే తప్పిస్తున్నారా? అనే అనుమాలకు తావిస్తున్న సందర్భంలో షాకింగ్ విషయాలను బయటపెట్టింది స్వాతి దీక్షిత్. ఈ సందర్భంగా హోస్ట్ నాగార్జున తనపై చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. స్వాతి దీక్షిత్ మాట్లాడుతూ.. ‘హౌస్‌లో ఆట ఆడేవాళ్లు.. ఎంటర్ టైన్ చేసేవాళ్లను మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తారు అని నాగార్జున గారు అనడం నన్ను షాక్‌కి గురిచేసింది. గత సీజన్లలో అలా అనలేదు.. నన్ను బిగ్ బాస్ హౌస్‌కి పంపించడం ఎందుకు?? ఎలిమినేట్ చేయడం ఎందుకు?? నేనేం చేయలేదని అనడం ఎందుకు?? ఎలిమినేట్ అయిన తరువాత వాళ్ల గురించి ఎవరూ అలా స్టేట్ మెంట్ ఇవ్వరు. నిజంగానే నేను ఏమీ చేయకపోతే.. నాగార్జున గారు అలా అన్నారంటే అర్థం ఉంది.. కానీ నా ఎఫర్ట్ నేను పెట్టాను. కానీ నాగార్జున గారు ఎంటర్ టైన్ చేయకపోతే జనాలు స్వాతి దీక్షిత్‌ని పంపించినట్టు మిమ్మల్ని కూడా పంపించేస్తారు అనే పాయింట్ నాకు నచ్చలేదు.. ఆయన అలా మాట్లాడటం తప్పు. ఆ మాటకు నేను ఒప్పుకోను. Read Also: నేను ఎంటర్ టైన్ చేయకపోతే చేయలేదు అని అన్నా ఒప్పుకునేదాన్ని.. నేను చేసిన దాంట్లో కనీసం ఫిఫ్టీ పర్శంట్ చూపించినా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని కానీ.. ఫిఫ్టీ కాదు కదా.. 5 % కూడా చూపించలేదు. నాకు అసలు స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు.. అంతా ఎడిటింగ్‌లో లేపేశారు.. ఇప్పుడు నేనేం చేయలేదని అంటున్నారు. నేను నా ఆట పట్ల నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను.. ఎలిమినేట్ అవ్వను అని అనుకున్నా.. మీరు చూస్తే నేను ఎలిమినేట్ అయ్యినందుకు ఏడ్వలేదు కూడా.. బాధపడలేదు. ఎందుకంటే నేను ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అవ్వలేదు.. వీళ్లే ఏదో చూశారని నాకు తెలుసు. అందుకే నేను బాధపడలేదు’ అంటూ చెప్పుకొచ్చింది స్వాతి దీక్షిత్. See pics:


By October 07, 2020 at 12:33PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bigg-boss-4-telugu-eliminated-contestant-swathi-deekshith-shocking-comments-on-host-nagarjuna/articleshow/78529733.cms

No comments