Breaking News

బర్త్ డే పార్టీ అని.. యువతిపై గ్యాంగ్ రేప్.. హైదరాబాద్‌లో దారుణం


బర్త్ డే పార్టీ పేరుతో స్నేహితురాలిని హోటల్‌కి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేసిన అమానుష ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఈ నెల 5న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జూబ్లీహిల్స్‌ ప్రాంతానికి చెందిన టీనేజ్ యువతి(19) సికింద్రాబాద్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. కాలేజీ ఫీజు కట్టేందుకు వెళ్లిన సమయంలో ఆమె స్నేహితులైన ముగ్గురు టీనేజ్ యువకులు బర్త్‌ డే వేడుకలకు రమ్మనడంతో నమ్మి వెళ్లింది. పుట్టిన రోజు వేడుకలు చేసుకుందామంటూ బిర్యానీ ప్యాకెట్లు, కేక్ తీసుకుని కూకట్‌పల్లిలోని ఓ హోటల్‌కి తీసుకెళ్లారు. ముందుగానే మత్తుమందు కలిపిన కేక్‌ని ఆమెతో తినిపించారు. అందరం కలిసి తిందామన్నా వినకుండా ముందు నువ్వే తినాలంటూ ఒత్తిడి చేసి తినిపించినట్లు తెలుస్తోంది. కేక్ తిన్న అనంతరం యువతి స్పృహ‌ కోల్పోయాక దారుణానికి పాల్పడ్డారు. అచేతనంగా పడి ఉన్న యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. Also Read: అనంతరం ఆమెను చంపేస్తామని బెదిరించి ఆటో ఎక్కించి ఇంటికి పంపించేశారు. దుర్మార్గుల బెదిరింపులకు భయపడిపోయిన యువతి మౌనంగా కుంగిపోయింది. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్న యువతి తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. అమానుష ఘటన సైబరాబాద్‌ పరిధిలో జరగడంతో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి సైబరాబాద్‌ పోలీసులకు బదిలీ చేశారు. నిందితులు మైనర్లుగా తెలుస్తోంది. Read Also:


By October 16, 2020 at 09:55AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/19-year-old-girl-gang-raped-in-hyderabad/articleshow/78693815.cms

No comments