Breaking News

ఉరికి వేలాడుతున్న మహిళ.. మోకాళ్లు నేలపై.! గుంటూరులో మిస్టరీ


వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గుంటూరులో జిల్లాలో వెలుగుచూసింది. మహిళ ఉరి వేసుకుని చనిపోయినప్పటికీ ఆమె మోకాళ్లు నేలని తాకుతుండడంతో ఆమెది హత్యా? ఆత్మహత్యా? అనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని అంగలకుదురు గ్రామానికి చెందిన ప్రియాంకకు నందివెలుగు జాషువానగర్‌కి చెందిన విజయ్‌కుమార్‌తో ఐదేళ్ల కిందట వివాహమైంది. కొద్దికాలం సాఫీగానే సాగిన కాపురంలో కలహాలు రేగాయి. భార్యపై అనుమానం పెంచుకున్న విజయ్‌కుమార్ తరచూ ఆమెతో గొడవపడేవాడు. నిత్యం మందు తాగొచ్చి వేధింపులకు గురిచేసేవాడు. అనూహ్యంగా ప్రియాంక ఇంట్లోనే శవమై తేలింది. ఆమె ఉరి వేసుకుని చేసుకుందని చెబుతున్నారు. అయితే ఉరికి వేలాడుతున్న ప్రియాకం మోకాళ్లు మాత్రం నేలని తాకుతూ ఉండడంతో ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. Also Read: అల్లుడే తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న తెనాలి రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Read Also:


By October 16, 2020 at 10:20AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-suspicious-death-in-guntur-district/articleshow/78694115.cms

No comments