మరో మహిళ మోజులో భర్త ఘాతుకం.. ఒంగోలులో దారుణం
ఒంగోలులో దారుణ ఘటన వెలుగుచూసింది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త ఘాతుకానికి పాల్పడ్డాడు. భార్య అడ్డు తొలగించుకునేందుకు హత్యాప్రయత్నం చేశాడు. ఈ ఘటన నగరంలోని శ్రీనగర్‌లో జరిగింది. ఒకటో లైన్‌కి చెందిన నాదెళ్ల కేశవనారాయణ గతంలో హోంగార్డుగా పనిచేసేవాడు. ప్రస్తుతం అతనిని విధుల నుంచి తొలగించారు. మరో హహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న శంకర్ నారాయణ ఎలాగైనా భార్య అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. భార్యను కత్తెరతో పొడిచి చంపేందుకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read:
By October 18, 2020 at 12:07PM
No comments