Breaking News

అవి లేకుండా అన్నయ్య సినిమానా?.. ఛాన్సే లేదంటున్న వినాయక్.. మెగా ఫ్యాన్స్‌ ఖుషీ


మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన లూసిఫర్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మొదట సాహో ఫేమ్ సుజీత్‌‌ను డైరెక్టర్‌గా ఓకే చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల అతడు తప్పుకున్నాడు. దీంతో చిరుకు ఎంతో ఇష్టమైన వి.వి.వినాయక్‌ వద్దకు ఈ సినిమా చేరింది. ఠాగూర్, ఖైదీ నం.150 వంటి రీమేక్ చిత్రాలతో చిరుకు బ్లాక్‌బస్టర్ హిట్లు అందించిన వినాయక్‌‌పై మెగా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చిరంజీవి సినిమా అంటే యాక్టింగ్ ఒక్కటే సరిపోదు కదా.. ఖచ్చితంగా చిరంజీవి స్టెప్పులు ఉండాల్సిందే. అయితే లూసిఫర్ సినిమాలో అసలు పాటలే ఉండవు. కథ బిగి సడలకుండా అక్కడ దర్శకుడు పాటలు లేకుండానే సినిమా తెరకెక్కించి హిట్ కొట్టాడు. తెలుగు ప్రేక్షకులను పాటలు, డ్యాన్సులు, కామెడీ లేకుండా మెప్పించడం కష్టం. పైగా చిరంజీవి సినిమా అండే డ్యాన్సులు కచ్చితంగా ఉండాల్సిందే. ఇటీవల వచ్చి ‘సైరా’ సినిమాలో చిరంజీవి పెద్దగా డ్యాన్సులు చేయకపోవడంతో అభిమానులు ఫీలయ్యారు. Also Read: ఇక చిరంజీవి లూసిఫర్ సినిమాలో నటిస్తున్నారని తెలిసి ఇందులోనూ ఆయన స్టెప్పులు చూడలేమని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి అభిమానులకు భరోసా ఇచ్చారు. మెగా ఫ్యాన్స్ పల్స్ బాగా తెలిసిన వినాయక్ లూసిఫర్ రీమేక్‌లో చాలా మార్పులు చేస్తున్నారట. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. డ్యాన్సులు, పాటలు లేకుండా అన్నయ్య సినిమాను తాను కూడా చూడలేనని, లూసిఫర్ రీమేక్‌లో అవన్నీ కచ్చితంగా ఉంటాయని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’లో నటిస్తున్న చిరంజీవి ఆ తర్వాత మెహర్ రమేష్‌తో వేదాళం రీమేక్‌తో పాటు వినాయక్‌తో లూసిఫర్‌ రీమేక్‌లోనూ నటించనున్నారు.


By October 27, 2020 at 03:02PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-v-v-vinayak-clarity-about-lucifer-remake-movie/articleshow/78889462.cms

No comments