Breaking News

లిబియాలో కిడ్నాప్ అయిన ఏపీవాసుల సహా ఏడుగురు భారతీయులు విడుదల


లిబియాలో అపహరణకు గురయిన ఏడుగురు భారతీయులను విడుదల చేసినట్లు టూనీషియాలోని భారత రాయబారి పునీత్ రాయ్ కుందల్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన ఏడుగురిని సెప్టెంబరు 14న లిబియాలోని అశ్వరీఫ్ నుంచి కిడ్నాప్ చేశారు. లిబియాలో ప్రస్తుతం భారత మిషన్ లేకపోవడంతో టూనీషియాలోని భారత రాయబార కార్యాలయం భారతీయుల క్షేమసమాచారాలను పర్యవేక్షిస్తుంది. కిడ్నాప్ అయిన ఏడుగురు కార్మికులు సురక్షితంగా విడుదల అయ్యారని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది. లిబియాలో పరిస్థితులు సరిగా లేనందున భారతీయులు అక్కడికి వెళ్లవద్దని 2015 సెప్టెంబరులో భారత విదేశాంగశాఖ హెచ్చరించింది. తర్వాత 2016లో లిబియాకు ప్రయాణాలపై నిషేధం విధించింది. నిషేధం కొనసాగుతున్నా కొందరు అక్కడికి వెళ్లిన వీరు కిడ్నాప్‌నకు గురయ్యారు. బాధితుల కుటుంబసభ్యులతో తాము మాట్లాడామని, కిడ్నాపర్ల చెర నుంచి ఏడుగురిని విడిపించామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. లిబియాలో నిర్మాణ, ఆయిల్ కంపెనీల్లో భారతీయులు పనిచేస్తున్నారని అనురాగ్ వివరించారు. లిబియా ప్రభుత్వంతో ట్యూనిషియాలో భారత రాయబార కార్యాలయం అధికారులు సంప్రదింపులు జరిపారని వెల్లడించారు. ‘లిబియాలోని భారతీయ పౌరుల సంక్షేమానికి సంబంధించిన విషయాలను నిర్వహించే ట్యునీషియాలోని మా రాయబార కార్యాలయం.. లిబియా ప్రభుత్వం, అక్కడ ఉన్న అంతర్జాతీయ సంస్థలను సంప్రదించింది. భారతీయ పౌరులను రక్షించడంలో వారి సహాయం కోరింది. కిడ్నాపర్లతో చర్చలు జరపడంతో భారతీయ పౌరులను సురక్షితంగా ఉన్నారు.. దీనికి సాక్ష్యంగా ఫోటోలను విడుదల చేశారు’ అని శ్రీవాస్తవ్ వివరించారు.


By October 12, 2020 at 08:39AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/seven-indian-nationals-released-who-kidnapped-in-libya/articleshow/78612255.cms

No comments