కామాంధుడిని కొడవలితో నరికి తప్పించుకున్న బాలిక.. చిత్తూరులో షాకింగ్


గొర్రెలు మేపేందుకు వెళ్లిన బాలికపై చేశాడో కామాంధుడు. బాలికను పొదల్లోకి లాక్కెళ్లి రేపు చేసేందుకు యత్నించిన కీచకుడిని కొడవలితో నరికి తప్పించుకున్న షాకింగ్ ఘటన జిల్లాలో జరిగింది. రామసముద్రం మండలం పెద్దకురప్పల్లె పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తన అక్కతో కలసి గొర్రెలను మేపేందుకు వెళ్లింది. ఆమెపై కన్నేసిన శంకర్(45) అటవీ ప్రాంతంలో కనిపించిన బాలికను పొదల్లోకి లాక్కెళ్లాడు. ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించడంతో బాలిక తీవ్రంగా ప్రతిఘటించింది. అయినా కీచకుడు వదలకపోవడంతో కొడవలితో చేతిపై వేటు వేసింది. చేయి నరకడంతో కామాంధుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఇంటికి తిరిగొచ్చిన బాలిక విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రామసముద్రం పోలీసులు విచారణ చేపట్టారు. Also Read:
By October 04, 2020 at 11:04AM
No comments