మద్యం తాగించి.. రోడ్డుపై పడుకోబెట్టి లారీతో తొక్కించి హత్య.. వీడిన రాంగోపాల్ మర్డర్ మిస్టరీ
గత నెల ఐదో తేదీ నుంచి కనిపించకుండా పోయిన కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన రాంగోపాల్ మర్డర్ మిస్టరీ వీడింది. లారీలో తీసుకెళ్లిన తన స్నేహితుడే అతన్ని అతికిరాతకంగా హత్య చేసినట్లు తేల్చారు. భార్యతో పెట్టుకున్నాడన్న కోపంతోనే నమ్మకంగా తీసుకెళ్లి దారుణంగా చంపేసినట్లు తేలింది. మద్యం మత్తులో ఉన్న స్నేహితుడిని రోడ్డుపై పడుకోబెట్టి లారీతో తొక్కించి చంపేసి.. రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు మీడియా సమావేశంలో తెలిపారు. కంచికచర్లకి చెందిన రాంగోపాల్ ఆస్ట్రేలియాలో ఎమ్మెస్ చేసి ఇటీవల ఇండియాకి వచ్చాడు. అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఆగస్టు 28న తన ఫ్రెండ్ లారీలో హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. సెప్టెంబర్ 5వ తేదీ వరకూ అతని సెల్‌ఫోన్ పనిచేస్తోంది. ఆ తరువాత ఆగిపోయింది. అతని స్నేహితుడైన లారీ డ్రైవర్ నాగేంద్రబాబు అలియాస్ చంటి రోడ్డు ప్రమాదంలో రాంగోపాల్ చనిపోయాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు, బంధువులకు అనుమానం వచ్చింది. పోలీసులను ఆశ్రయించడంతో చివరిగా అతని సెల్‌ఫోన్ బొబ్బిలిలో ఉన్నట్లు సిగ్నల్ చూపించడంతో అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై ఈ నెల 6 వ తేదీన యువకుడి మృతదేహం నుజ్జునుజ్జై కనిపించింది. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్డు ప్రమాదంలో చనిపోయి ఉంటాడని భావించి మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే రాంగోపాల్ కనిపించకుండా పోయాడన్న కృష్ణా జిల్లా పోలీసుల సమాచారంతో బొబ్బిలి పోలీసులు విచారణ చేపట్టడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాంగోపాల్ వచ్చిన లారీ డ్రైవర్ నాగేంద్రబాబుని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో దారుణం బయటపడింది. ఆగస్టు 26న చుట్టుపక్కల లారీ లోడు చేసుకున్న నాగేంద్రబాబు 28న రాంగోపాల్‌ను తీసుకెళ్లాడు. అక్కడి నుంచి గుజరాత్ వెళ్లారు. అటు నుంచి టైల్స్ లోడు చేసుకుని బొబ్బిలి వచ్చారు. గ్రోత్ సెంటర్‌లో గత నెల 5న అన్‌లోడ్ చేసి ఓ సిమెంట్ షాపు వద్ద లారీ ఆపాడు. రాంగోపాల్ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కోపం పెంచుకున్న నాగేంద్రబాబు అతన్ని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. క్లీనర్ సాయితేజని క్యాబిన్‌లో పడుకోమని చెప్పి రాంగోపాల్‌తో ఫుల్లుగా మద్యం తాగించాడు. తనకు అలవాటు ఉన్నా అతను మద్యం తాగలేదు. Also Read: మద్యం మత్తులో స్పృహ కోల్పోయాక దారుణానికి పాల్పడ్డాడు. రాంగోపాల్‌ని జాతీయ రహదారిపై పడుకోబెట్టి తన లారీతో తొక్కించి కిరాతకంగా చంపేశాడు. రాంగోపాల్ శరీరాన్ని నుజ్జునుజ్జు చేశాడు. అనంతరం అక్కడి నుంచి కంచికచర్ల వచ్చేశాడు. తనకేమీ తెలియనట్టు మరో లోడుతో గుజరాత్ వెళ్లిపోయాడు. రాంగోపాల్ ఎక్కడికెళ్లాడని క్లీనర్ సాయితేజ అడిగితే రూ.3 వేలు తీసుకుని బంధువుల ఇంటికి వెళ్లాడని ఒకసారి.. లారీ ఢీకొట్టిందని మరోసారి చెప్పినట్లు తెలిసింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని క్లీనర్‌ని బెదిరించనట్లు విచారణలో వెల్లడైంది. మర్డర్ కేసు నమోదు చేసిన బొబ్బొలి పోలీసులు డ్రైవర్ నాగేంద్రబాబుని అరెస్టు చేశారు. Read Also:
By October 04, 2020 at 10:36AM
No comments