Breaking News

గ్రిడ్ వైఫల్యంతో ముంబయిలో నిలిచిన విద్యుత్ సరఫరా.. ఆగిపోయిన లోకల్ ట్రెయిన్స్


ముంబయి మహానగరంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో లక్షలాది మంది పౌరులు, ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ముంబయి, థానే, నవీ ముంబయి సహా ఇతర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్తును సరఫరా చేసే లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్‌లు పలుసార్లు ట్రిప్పింగ్ కావడంతో ముంబై, శివారు ప్రాంతాలు అంధకారంలో చిక్కుకున్నాయని, పునరుద్ధరణ ప్రక్రియ కొనసాగుతోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. గ్రిడ్‌లో సాంకేతిక లోపం వల్లే విద్యుత్ సరఫరా నిలిచినట్టు తెలుస్తోంది. టాటా పవర్స్ వైఫల్యంతో నగరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని బృహణ ముంబయి విద్యుత్, సరఫరా విభాగం అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో లోకల్ ట్రెయిన్ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముంబయి నగరంలో ప్రజా రవాణాపై ఎక్కువ మంది ఆధారపడతారు. కార్యాలయాలకు లోకల్ ట్రెయిన్స్‌లో వెళ్లొస్తారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల అనేక మంది రైలు పట్టాల వెంబడి నడిచివెళుతున్నారు.


By October 12, 2020 at 11:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/major-power-outage-across-mumbai-thane-lakhs-of-commuters-stranded/articleshow/78614311.cms

No comments