Breaking News

భర్త ఇంట్లో లేడని అర్ధరాత్రి తలుపుకొట్టి.. తూర్పు గోదావరిలో దారుణం


జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. భర్త ఇంట్లో లేడని తెలిసి అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడి మహిళపై నీచానికి ఒడిగట్టాడో ప్రబుద్ధుడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో దొరికిపోతానేమోనన్న భయంతో పరుగు తీశాడు. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఒడిశా నుంచి వలసొచ్చిన దంపతులు ఎన్టీఆర్ కాలనీలో నివాసముంటూ స్థానికంగా ఓ రొయ్యల పరిశ్రమలో పనిచేసుకుంటున్నారు. కొద్దిరోజుల కిందట భర్త ఊరికి వెళ్లడంతో భార్య పిల్లలతో కలసి ఇంట్లోనే ఉంటోంది. అదే భవనంలోని పై పోర్షన్‌లో మరో కుటుంబం నివాసముంటోంది. పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామానికి చెందిన రంగనాథం జీవారత్నం(జీవా) తరచూ వారింటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో కింద పోర్షన్‌లో ఉంటున్న మహిళపై కన్నేశాడు. భర్త కూడా ఇంట్లో లేడని తెలుసుకుని నీచానికి ఒడిగట్టాడు. Also Read: అర్ధరాత్రి వేళ ఆమె తలుపుకొట్టాడు. మహిళ తలుపు తీయడంతో ఒక్కసారిగా ఆమె నోరునొక్కి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో పాటు పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారైనట్లు భాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. భాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే నిందితుడు స్థానిక నాయకుడు కావడంతో పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని.. అత్యాచారానికి యత్నించిన వ్యక్తి అధికారిక కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడంటూ మహిళా సంఘాలు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించాయి. నిందితుడిని తక్షణమే అరెస్టు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. Read Also:


By October 22, 2020 at 09:54AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-attempts-rape-on-migrant-labourer-in-east-godavari/articleshow/78801345.cms

No comments