Breaking News

‘ఆర్ఆర్ఆర్’ మళ్లీ షురూ... 22న ఫ్యాన్స్‌కి పూనకాలే


బాహుబలి-2 తర్వాత దర్శకధీరుడు తెరకెక్కిస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్(రౌద్రం రణం రుధిరం). పీరియాడిక్యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, కొమరం భీంగా నటిస్తున్నారు. సుమారు 80శాతం షూటింగ్ పూర్తికాగా.. కరోనా కారణంగా మిగిలిన పార్ట్ వాయిదా పడింది. సుమారు ఏడు నెలల తర్వాత హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ ప్రారంభమైంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా యూనిట్ సభ్యులను ముందుగా మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉంచినట్లు సమాచారం. Also Read: మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయడం ఇక మా వంతు అంటూ ప్రకటించిన తాజాగా ప్రకటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం అందుకు తగినట్లుగానే అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చింది. కరోనా తర్వాత షూటింగ్‌ను ఎలా మొదలు పెట్టిందన్న విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు రాజమౌళి ప్రత్యేక వీడియోను సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. ‘విశ్రాంతి.. పునరుత్తేజం.. ఉత్సాహంతో ముందుకు..’ అంటూ #WeRRRBack అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. అంతేకాదు అక్టోబరు 22న "రామరాజు ఫర్ భీమ్'' కోసం ఎదురు చూడాలని చిత్ర బృందం వెల్లడించింది. అభిమానుల ఎదురు చూపులకు తెరదించుతూ ఆరోజు రామ్ చరణ్ వాయిస్‌తో ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ కానుంది. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్‌కు జంటగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌, ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌, హాలీవుడ్‌ నటీనటులు ఎలిసన్‌ డ్యూడీ, రేయ్‌ స్టీవ్‌సన్‌ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. Also Read:


By October 06, 2020 at 11:47AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rrr-shooting-back-to-shoot-ss-rajamouli-shares-bts-video-hinting/articleshow/78508670.cms

No comments