ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. అనంతపురంలో దారుణం
ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. మహిళతో శారీరక సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రాంనగర్ 80 ఫీట్ రోడ్‌లో ఈ దారుణం జరిగింది. కల్యాణదుర్గం మండలం మంగళకుంట గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ మహ్మద్ రఫీ కొన్నేళ్లుగా నగరంలోని మంగళవారి కాలనీలో నివాసముంటున్నాడు. అతనికి కల్యాణదుర్గం రోడ్‌లో ఉంటున్న మహిళతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. రెండేళ్లుగా ఆమెతో శారీరక సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. రఫీని తానే హత్య చేసినట్లు గోపీ అనే వ్యక్తి అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హత్యకు గురైన మహమ్మద్ రఫీ గతంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వద్ద కొంతకాలం ఫోటో గ్రాఫర్‌గా పనిచేశాడు. Also Read:
By September 27, 2020 at 11:14AM
No comments