Vizag: నాజూకుగా మారుస్తానంటూ దగ్గరై ఫ్రెండ్ భార్యతో పరార్.. షాకింగ్ ట్విస్ట్
లావుగా ఉన్న ఫ్రెండ్ భార్యని సన్నగా చేస్తానంటూ మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడో కిలాడీ. భర్తకి తెలియకుండా ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు. తీరా భార్య కనిపించకపోవడంతో ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన పోలీసులకి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చి జంట జారుకుంది. దీంతో రెండు రాష్ట్రాల పోలీసులు జంట కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి భార్య, కుమారుడితో ఎల్బీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతనికి విశాఖపట్నం శ్రీహరిపురానికి చెందిన బెహరా(56)తో పరిచయమైంది. ఫ్రెండ్ భార్య(36)తో పరిచయం పెంచుకుని బెహరా బాగా దగ్గరయ్యాడు. లావుగా ఉన్న ఆమెను సన్నగా చేస్తానంటూ మాయమాటలు చెప్పి విశాఖ తీసుకెళ్లిపోయాడు. ఇంట్లో భార్య లేకపోవడంతో భర్త ఎల్‌బీనగర్ పోలీసులను ఆశ్రయించాడు. బెహరాపై అనుమానం ఉందని చెప్పడంతో అక్కడి పోలీసులు విశాఖ చేరుకున్నారు. సివిల్ డ్రెస్‌లో శ్రీహరిపురంలోని బెహరా ఇంటి వద్దకు వెళ్లి విచారించారు. ఫ్రెండ్ భార్యని బెహరా తీసుకొచ్చినట్లు గుర్తించిన సివిల్ పోలీసులు ఆమెను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో స్థానికులు గుర్తుతెలియని వ్యక్తులు మహిళను లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన విశాఖ పోలీసులు స్పాట్‌కి చేరుకుని ఆరా తీయడంతో తాము ఎల్‌బీనగర్ పోలీసులమంటూ ఐడీ కార్డులు చూపించారు. Read Also: అక్కడి నుంచి వచ్చింది పోలీసులని తెలియడంతో పారిపోయి వచ్చిన జంట షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. రెండు రాష్ట్రాల పోలీసులు వివరాలు తెలుసుకుంటున్న సమయంలో సైలెంట్‌గా అక్కడి నుంచి జారుకుని ఇరురాష్ట్రాల పోలీసులకి షాకిచ్చారు. పోలీసులు అప్రమత్తమయ్యేలోగా ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. జంట ఆచూకీ కోసం రెండు రాష్ట్రాల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. Also Read:
By September 19, 2020 at 10:55AM
No comments