Breaking News

మైనర్ బాలికకు మద్యం తాగించి ఇద్దరి కామాంధుల అత్యాచారం


దేశంలో కామాంధులు ఇష్టారీతిగా రెచ్చిపోతున్నారు. నిత్యం వందలాది అబలల జీవితాలు వారి చేతుల్లో నలిగిపోతున్నాయి. తాజాగా ఇంటి పక్కన ఉండే బాలికపై కన్నేసిన ఓ వ్యక్తి ఆమెకు మద్యం అలవాటు చేసి తన కామవాంఛలు తీర్చుకుంటున్నాడు. ఈ ఘటన పంజాబ్‌లో వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌లోని భటిండా ప్రాంతానికి చెందిన అరవింద్ అనే వ్యక్తి తన పక్కింట్లో ఉండే బంధువుల అమ్మాయిపై కన్నేశాడు. వీలు చిక్కినప్పుడల్లా ఆమెతో మాట్లాడుతూ మద్యం తాగించేవాడు. కొద్దిరోజులకు ఆమె మద్యానికి బానిసైంది. Also Read: దాన్ని ఆసరాగా తీసుకున్న అరవింద్ ఆమెతో తన కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. రెండ్రోజుల క్రితం బర్త్‌డే వేడుకల పేరుతో బాలికను ఇంటికి పిలిచిన అరవింద్ తన స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లిన బాలిక ఈ దారుణం గురించి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అరవింద్, అతడి స్నేహితుడిపై పోక్సో చట్టం కింద నమోదు చేసి అరెస్ట్ చేశారు. Also Read:


By September 02, 2020 at 10:29AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/two-men-arrested-for-raping-minor-girl-in-punjab/articleshow/77883779.cms

No comments