Breaking News

నకిలీ డాక్యుమెంట్లతో రూ.1.80కోట్లతో లోన్.. బ్యాంక్ మేనేజర్ అరెస్ట్


నకిలీ పత్రాలతో లోన్ పొందేందుకు వచ్చిన వారి వివరాలు, దస్తావేజులు పరిశీలించకుండా ఉద్దేశపూర్వకంగా రూ.1.80 కోట్లు మంజూరు చేసిన బ్యాంక్ మేనేజర్‌ను హైదరాబాద్‌ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో చీఫ్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్‌.ఎస్‌.మహాపాత్ర ఎనిమిదేళ్ల క్రితం ఖైరతాబాద్‌లో పని చేశారు. ఆ సమయంలో జి.నిరంజన్‌, వి.కృష్ణ, సతీష్‌ కొల్లూరు, వి.లక్ష్మినారాయణ, ప్రభాకర్‌ తమకు లోన్ కావాలంటూ మహాపాత్రను సంప్రదించారు. Also Read: వారు సమర్పించిన తప్పుడు పత్రాలను సరిగ్గా పరిశీలించకుండానే చీఫ్‌ మేనేజర్‌ హోదాలో ఉన్న మహాపాత్ర రూ.1.80 కోట్లు రుణంగా మంజూరు చేశారు. ఆ తరువాత నిరంజన్‌, సతీష్‌ ఒక్క వాయిదా కూడా చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు వారు సమర్పించిన పత్రాలను పరిశీలించగా నకిలీవని తేలింది. Also Read: చనిపోయిన వ్యక్తుల సంతకం పెట్టడం ద్వారా పవరాఫ్‌ అటార్నీ సృష్టించి ఆ పత్రాలతో లోన్ తీసుకున్నారని విచారణలో తేలింది. దీంతో బ్యాంక్ అధికారులు ఆరు నెలల క్రితం సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొద్దిరోజుల క్రితం నిరంజన్‌, సతీష్‌, వి.లక్ష్మినారాయణ, ప్రభాకర్‌లను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తాజాగా బ్యాంక్ మేనేజర్ మహాపాత్ర, న్యాయ సలహాదారు నర్సింగ్‌రావులను అరెస్ట్ చేశారు. Also Read:


By September 02, 2020 at 09:49AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/bank-of-maharastra-manager-arrested-for-loan-fraud-in-hyderabad/articleshow/77883260.cms

No comments