మంచం పట్టినా మామ కామం.. కోడలి నడుం పట్టుకుని.. దారుణం


ముసలోళ్లైన తల్లిదండ్రులకు కన్నబిడ్డలే సపర్యలు చేసేందుకు వెనకాడుతూ వృద్ధాశ్రమాల్లో విడిచిపెడుతున్న దారుణాలు చూస్తూనే ఉన్నాం. కానీ ఆ కోడలు పక్షవాత లక్షణాలతో మంచం పట్టిన మామకి సేవలు చేయడమే నేరమైంది. కామంతో కళ్లు మూసుకుపోయి కోడలితో నీచం ప్రవర్తించాడు. కొడుకేమో అదనపు కట్నం కావాలంటూ నిత్యం వేధింపులకు గురిచేయడంతో ఇక ఆ నరకం భరించలేక పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన గుజరాత్‌లో వెలుగుచూసింది. అహ్మదాబాద్‌కి చెందిన మహిళ(36) అత్తింటి వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించింది. కూతురిలా చూసుకోవాల్సిన మామ కామకోరికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని వాపోయింది. కొన్నేళ్ల కిందట పక్షవాత లక్షణాలతో మామ ఆరోగ్యం క్షీణించి మంచం పట్టాడు. ఆ సమయంలో ఓపికగా మామకి సపర్యలు చేసింది. అయితే కామకోరికలతో రెచ్చిపోయిన మామ దారుణానికి పాల్పడ్డాడు. కోడలు సేవలు చేస్తుండగా ఆమె శరీర భాగాలను అసభ్యకరంగా తాకడం మొదలుపెట్టాడు. Also Read: మొదట్లో పొరపాటున తగిలిందనుకున్న కోడలు పట్టించుకోలేదు. కొద్దిరోజులకి ఆమె నడుం చుట్టూ చేయివేసి దగ్గరకి లాగడంతో బిత్తరపోయి గది బయటకు పరిగెత్తింది. మరోవైపు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేందుకు అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త, ఆమె ఆడపడుచు వేధిస్తున్నారు. ఇక చేసేది లేక భాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. Read Also:
By September 20, 2020 at 12:27PM
No comments