Surya Kiran: అందుకే కళ్యాణి వదిలేసింది.. బలుపు ఎక్కువ! అప్పులోళ్లు ఇంటిమీదికి వచ్చి.. సూర్య కిరణ్ ఆవేదన
గత వారం రోజులుగా డైరెక్టర్ సూర్య కిరణ్‌కి సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆయన డివోర్స్ అంశం జనాల్లో హాట్ టాపిక్ అయింది. బిగ్‌బాస్ సీజన్ 4 కంటిస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన సూర్య కిరణ్ తొలివారంలోనే ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఆయనను పలు మీడియా సంస్థలు ఇంటర్వూస్ చేస్తున్నాయి. అయితే ఈ ఇంటర్వ్యూల్లో తన భార్య , తమ విడాకుల మ్యాటర్ గురించి అలాగే జీవితంలో తాను పడిన కష్టాలు గురించి అన్నీ వివరిస్తున్నారు . దీంతో కళ్యాణి- సూర్య కిరణ్‌లకు సంబంధించిన ఎన్నో సీక్రెట్స్ బయటకొస్తున్నాయి. కళ్యాణితో విడాకులు: సత్యం, ధన 51, బ్రహ్మాస్త్రం, రాజు భాయ్ వంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సూర్య కిరణ్.. హీరోయిన్ కళ్యాణిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2016లో విడాకులు తీసుకొని ఎవరి జీవితం వారు గడుపుతున్నారు. కాగా లేటెస్ట్ ఇంటర్వ్యూల్లో కళ్యాణితో ప్రయాణం.. తన లైఫ్ జర్నీ గురించిన ఎన్నో విషయాలు ప్రస్తావిస్తూ ఎమోషనల్ అవుతున్నారు సూర్య కిరణ్. ఒక్క సినిమాతోనే జీవితం ఛేంజ్: దాదాపు 9 ఏళ్లుగా సినిమాకు దూరంగా ఉన్నానని, ఒకే ఒక్క సినిమా నిర్మాణం తన జీవితాన్ని నాశనం చేసిందంటూ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆవేదన చెందారు సూర్య కిరణ్. ఆ ఒక్క సినిమాతోనే జీవితంలో సంపాదించిందంతా పోగొట్టుకొన్నానని, బ్యాంకు వాళ్లు వచ్చి ఇంటిని సీజ్ చేయడం, ఉన్న నాలుగు కార్లు తీసుకెళ్లడం జరగడంతో పరిస్థితి తలక్రిందులయిందని చెప్పారు. బీఎండబ్ల్యూ కారులో వెళ్లే తాను చివరకు అసిస్టెంట్ ద్విచక్రవాహనంపై వెళ్లే పరిస్థితి వచ్చిందని తెలిపారు. అయితే అప్పుల వాళ్ళు ఇంటిమీదకొచ్చి గొడవలు చేయడం తట్టుకోలేకపోయిన కళ్యాణి తనను వదిలేసిందని చెబుతూ ఆవేదన చెందారు. Also Read: స్నేహితుల సాయం.. సూసైడ్ చేసుకొనే పరిస్థితి: కష్టాల్లో ఉన్నప్పుడు కొందరు స్నేహితులు సాయం చేయడంతో మెల్లగా బయటపడ్డానని ఆయన చెప్పారు. తనకు బలుపు ఎక్కువ అని, తాను ఎదుర్కొన్న సమస్యలకు కనీసం 300 సార్లైనా సూసైడ్ చేసుకొనే పరిస్థితి ఉంటుందని తెలిపారు. కాకపోతే ఈ జన్మకు కళ్యాణే తన భార్య అని, ఆమెతో ప్రయాణం మరువలేనిదని ఆయన చెప్పారు. గుడికి వెళ్లితే కొందరు డబ్బు కావాలని, ఇంకొందరు మంచి కెరీర్ కావాలని, మరికొందరు మంచి లైఫ్ కావాలని కోరుకుంటారు.. కానీ నేను మాత్రం అవన్నీ కోరుకుంటా అన్నారు సూర్య కిరణ్.
By September 20, 2020 at 12:51PM
No comments