Breaking News

రాజ్యసభ సభ్యుడిగా జీతభత్యాలు తీసుకోని జస్టిస్ రంజన్ గొగొయ్


సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, సభ్యుడు రంజన్ గొగోయ్‌కి సంబంధించి ఓ ఆసక్తి కరమైన అంశం వెలుగులోకి వచ్చింది. మార్చిలో ఆయన రాజ్యసభ‌కు నామినేట్ కాగా.. సభ్యునిగా ప్రమాణం చేసినప్పటి నుంచి ఆయన జీతభత్యాలతో పాటు అలవెన్సులను కూడా తీసుకోవడం లేదని వెల్లడైంది. ఈ విషయంపై ‘ఇండియాటుడే’ గ్రూపు చట్టం కింద రాజ్యసభ సెక్రటేరియట్‌ను సమాచారం కోరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రాజ్యసభ సభ్యుని హోదాలో వచ్చే జీత భత్యాలను తాను పొందకూడదని నిర్ణయించుకున్నట్లు గొగోయ్ రాజ్యసభ సచివాలయానికి ఓ లేఖ రాశారు. ‘నేను రాజ్యసభ సభ్యుని హోదాలో పొందే జీత భత్యాలు (ప్రయాణ ఖర్చులు మినహాయించి) తీసుకోవడం లేదు. వీటికి బదులుగా సీజేఐగా పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చే ప్రయోజనాలను మాత్రం పొందాలని నేను నిర్ణయించుకున్నాను’ అని గొగోయ్ తన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు సీజేఐగా పదవీ విరమణ చేసిన తర్వాత తనకు పెన్షన్ కింద రూ.82,301 వస్తోందని మార్చి 24న రాసిన లేఖలో వివరించారు. రాజ్యసభ సెక్రటేరియట్ వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. జీతాలు, ఇతర అలవెన్సుల కింద 226 మంది సభ్యులకు జులై నెలలో రూ.2,99,18,00 చెల్లించారు. రాజ్యసభ వెబ్‌సైట్ ప్రకారం.. ఆగస్టు 30 నాటికి, 243 మంది ఎంపీలు ఉండగా... జులైలో గణాంకాలలో 17 మంది ఎంపీలు తక్కువ ఉన్నారు. జస్టిస్ రంజయ్ గొగొయ్ సహా మరో ఇద్దరు కూడా రాజ్యసభ సభ్యులుగా జీతాలు తీసుకోవడం లేదు. మనోజ్ ఝా, రాకేశ్ సిన్హాలు కేవలం అలవెన్సులను మాత్రమే డ్రా చేస్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులకు ఇప్పటికీ పాఠాలు చెబుతున్నాను.. పీహెచ్‌డీ స్కాలర్స్‌ను పర్యవేక్షిస్తున్నా కాబట్టి అక్కడ నుంచే జీతం అందుతోందని, రాజ్యసభ సభ్యుడిగా తీసుకోవడంలేదని మనోజ్ ఝా వెల్లడించారు. రాకేశ్ సిన్హా సైతం ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఆగస్టు 20 నాటికి, 506 మంది రాజ్యసభ మాజీ ఎంపీలకు పార్లమెంటరీ పెన్షన్‌ను సచివాలయం మంజూరు చేసింది.


By September 02, 2020 at 09:30AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/former-cji-ranjan-gogoi-lone-rajya-sabha-mp-not-drawing-salary-and-allowances-reveals-rti/articleshow/77883096.cms

No comments