కూతురి ప్రేమ రేపిన చిచ్చు.. నేటికీ ఆగని నరమేధం.. పెట్రోల్ బాంబులేసి ప్రియుడి తల్లి హత్య
మొన్న మారుతీరావు.. నిన్న లక్ష్మారెడ్డి.. కూతుళ్ల ప్రేమ వివాహంతో పరువు పోయిందంటూ కోపంతో రగిలిపోయి దారుణ హత్యలకు తెగబడిన ఘటనలు మరువక ముందే మరో హత్యాకాండ వెలుగుచూసింది. కూతురు పెద్దలను ఎదిరించి ఇంటి నుంచి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేక ఆమె ప్రియుడిని కిరాతకంగా చంపేశారు. అయితే ఆ నరమేధం అంతటితో ఆగిపోలేదు. అతని కుటుంబ సభ్యులు యువతి బంధువులను తెగనరికారు. తమ వారిని నరికి చంపిన నిందితులు జైలు నుంచి బయటికొచ్చారని తెలిసిన అవతలి వర్గం పగతో రగిలిపోయింది. పది మంది ఇంటిపై దాడి చేసి పెట్రోల్ బాంబులేసి.. వేటకొడవళ్లతో దాడి చేసి మరో ఇద్దరు మహిళలను మట్టుబెట్టారు. ఇలా.. ప్రేమ వివాహం రేపిన చిచ్చు ఆరకుండా మనుషులను బలి తీసుకుంటూనే ఉంది. ఈ అత్యంత అమానుష దమనకాండ తమిళనాడులో చోటుచేసుకుంది. జిల్లా నంగునేరి తాలూకా మరుగల్‌కురిచ్చికి చెందిన షణ్ముగతాయి(50) కుమారుడు నంబిరాజన్(21) అదే ప్రాంతానికి చెందిన యువతి టి.వన్మతి ప్రేమించుకుని ఇంటి నుంచి పారిపోయారు. అదే ఇరుకుటుంబాల మధ్య చిచ్చును రాజేసింది. పరువు పోయిందని రగిలిపోయిన యువతి అన్న చెల్లసామి చెల్లెలి ప్రియుడిని దారుణంగా చంపేశాడు. గతేడాది నవంబర్‌లో నంబిరాజన్ హత్యకు గరయ్యాడు. కొడుకు హత్యను జీర్ణించుకోలేకపోయిన తాయి కుటుంబం ప్రతీకారేచ్ఛతో రగిలిపోయింది. అదను చూసి గత మార్చిలో ప్రత్యర్థి కుటుంబ సభ్యులపై దాడి చేసి ఇద్దరిని కిరాతకంగా చంపేశారు. దీంతో పగలు మరింత పెరిగిపోయాయి. నిందితులు జైలుకెళ్లి బెయిల్‌పై బయటికొచ్చారన్న విషయం తెలుసుకున్న యువతి బంధువులు ఎలాగైనా తమ వారిని హత్య చేసిన వారిని చంపేయాలని నిర్ణయించుకున్నారు. Also Read: పగ, ప్రతీకారంతో రగిలిపోయి షణ్ముగతాయి ఇంటిపై దాడి చేశారు. సుమారు పది మంది మూకుమ్మడిగా పెట్రోల్ బాంబులతో విరుచుకుపడ్డారు. బాంబులు పడడంతో ఇంటి నుంచి బయటికొచ్చిన షణ్ముగతాయి వేటకొడవళ్లతో అమానుషంగా నరికి చంపేశారు. అక్కడికి సమీపంలోనే ఉన్న ఆమె బంధువు, జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్న మురుగన్ ఇంటిపై దాడి చేసేందుకు వెళ్లారు. అది గమనించి అప్రమత్తమైన మురుగన్ అక్కడి నుంచి పారిపోయాడు. Read Also: మురుగన్ ఇంట్లో కనిపించకపోవడంతో ఆయన భార్య శాంతి(50)ని కిరాతకంగా హత్య చేశారు. మారణాయులతో నరికి చంపేశారు. శాంతిపై దాడి చేస్తున్న సమయంలో అడ్డుపడిన మైనర్ బాలికకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జిల్లా ఎస్పీ స్పాట్‌ని పరిశీలించి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువతీ యువకుల ప్రేమ రాజేసిన చిచ్చు నేటికీ ఆరకుండా ఇరుకుటుంబాలను దహించివేస్తోంది. ఇప్పటికి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నరమేధం ఎప్పటికి ఆగుతుందో!! Also Read:
By September 27, 2020 at 10:17AM
No comments