Breaking News

Anushka: ఇంట‌ర్నేష‌నల్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్న అనుష్క.. సెట్‌లో ఆమె ప్రవర్తన: నిశ్శబ్దం డైరెక్టర్


స్వీటీ , మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమా ''. బాహుబలి సిరీస్ ద్వారా తన పాపులారిటీని మరింత పెంచుకున్న స్వీటీ.. ఈ సినిమాలో డిఫరెంట్ రోల్ పోషించింది. అంజ‌లి, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌ ముఖ్యపాత్రలు పోషించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2 తేదీన ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో సినిమా గురించిన ఆసక్తికర విషయాలు చెప్పారు డైరెక్టర్ హేమంత్ మధుకర్. నిశ్శ‌బ్ధం ఎలా మొద‌లైంది పుష్ప‌క విమానం టైపులో ప్ర‌స్తుత సాంకేతిక‌ను వాడుకొని థిల్ల‌ర్ నేప‌థ్యంగా ఓ ప్రయోగాత్మక మూవీ చేయాల‌నుకున్నా. అలా పుట్టిందే ఈ నిశ్శ‌బ్ధం క‌థ‌. స్టోరీ మొత్తం రెడీ అయ్యాక ఓ రోజున రైట‌ర్ కొన వెంక‌ట్ గారికి వినిపించాను. ఆయ‌న‌కు న‌చ్చ‌డంతో కోనగారి ద్వారా అనుష్క త‌దిత‌ర యాక్ట‌ర్లకు కూడా స్టోరీ చెప్పి ఒప్పించి ఈ ప్రాజెక్ట్‌ని దాదాపుగా మొద‌లుపెట్టే స్థితికి తీసుకువ‌చ్చాను. అయితే ప్రయోగం అంటే నిర్మాత‌లు పెట్టుబ‌డి పెట్ట‌డానికి కాస్త వెనుకంజ వేసే అవ‌కాశం ఉండ‌టంతో కోన‌గారి సూచ‌న‌ల‌తో నేను అనుకున్న మూకీ సినిమాను కాస్త డైలాగ్స్‌తో నింపి, మెయిన్ క్యారెక్టర్ వ‌ర‌కు మాత్రం సైలెంట్‌గా ఉండేలా ప్లాన్ చేసుకున్నా. కోన గారి ఆధ్వర్యంలో సిద్ధ‌మైన డైలాగ్స్ నా స్టోరీకి అడిష‌న‌ల్ అసెట్ కావడంతో డ ఫ్యాక్ట‌రీ, విశ్వ ప్ర‌సాద్ గారు ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకొ‌చ్చారు. వారితో పాటు కోన‌వెంక‌ట్ గారు త‌న బ్యాన‌ర్ కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ ద్వారా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా చేర‌డంతో మా 'నిశ్శ‌బ్ధం' మొదలైంది. ఈ చిత్రాన్ని అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కించ‌డానికి కార‌ణం ఏంటి? టైటిల్‌కి త‌గ్గ‌ట్లుగానే ఈ సినిమాను ఏదైనా పీస్‌ఫుల్ ప్లేస్‌లో తెర‌కెక్కించాల‌ని ముందు నుంచి అనుకున్నాం. అయితే విజువ‌ల్ గ్రాండియ‌ర్‌గా క‌నిపించ‌డంతో పాటు ఆడియెన్స్‌కి కొంతమేర ఫ్రెష్ ఫీల్ రావ‌డానికి ఈ సినిమాను అమెరిక‌న్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించాము. అలానే ఈ సినిమాలో అనుష్క కూడా అమెరిక‌న్ బార్న్ ఇండియ‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. అన్ని ముఖ్య పాత్ర‌లు కూడా అమెరికా నేప‌థ్యంలోనే ఉంటాయి. ఇక హాలీవుడ్ న‌టుడు మైఖ‌ల్ మ్యాడిస‌న్‌ని కూడా ఒరిజినాలిటీ మిస్ అవ్వ‌కూడ‌ద‌నే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకోవ‌డం జ‌రిగింది. ఈ మ‌ధ్యకాలంలో ఓ హాలీవుడ్ న‌టుడు ఫుల్ లెంత్ రోల్ చేసిన సినిమా నిశ్శ‌బ్ధ‌మే కావ‌చ్చు. అనుష్క‌, మాధ‌వ‌న్, అంజ‌లి వంటి యాక్ట‌ర్స్ ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నారు, ఓ ద‌ర్శ‌కునిగా వారితో మీ ప్ర‌యాణం ఎలా సాగింది? అనుష్క గారికి ఉన్న ఫేమ్‌తో పోల్చుకుంటే నేను చిన్న ద‌ర్శ‌కున్ని. అయితే ఆమె మాత్రం ఇదేమీ ప‌ట్టించుకోకుండా ప్ర‌తిది అడిగి తెలుసుకుని న‌టించారు. ఈ సినిమా కోసం అమె ఇంట‌ర్నేష‌న‌ల్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు. అలానే మాధ‌వ‌న్ కూడా త‌న పాత్ర కోసం చాలా ప్రిప‌రేష‌న్ తీసుకున్నారు. అంజ‌లి సైతం ఓ అమెరిక‌న్ కాప్‌గా క‌నిపించ‌డానికి స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకుని త‌న లుక్ మార్చుకున్నారు. అయితే ఇన్ని టాలెంట్స్‌ని ఓ చోట చేర్చి సినిమా తీయ‌డం అంటే కొంత‌మేర క‌ష్ట‌మే అయిన‌ప్ప‌టికి వీరింద‌రికీ ఉన్న ప్రొఫిష‌న‌లిజం కార‌ణంగా మా షూటింగ్ ఆద్యంతం హాయిగా సాగిపోయింది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ తో మీ అనుభ‌వం గురించి చెప్పండి పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ అధినేత విశ్వ ప్ర‌సాద్ గారు నేను చెప్పిన క‌థ‌ను న‌మ్మి బ‌డ్జెట్ విష‌యంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. అమెరికాలో సినిమా తీయ‌డం అంటే క‌త్తిమీద సామే అనుకోవాలి. వీసాల ద‌గ్గ‌ర నుంచి షూట్‌ లొకేష‌న్స్‌లో ప‌ర్మిష‌న్స్ ఇలా చాలా వ్య‌వ‌హారాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అయితే ప్రొడ‌క్ష‌న్ వారు ఇచ్చిన స‌పోర్ట్ కార‌ణంగానే నేను ఈ సినిమా షూటింగ్‌ని 55 రోజుల్లో ముగించేశాను. ఇక కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ మా సొంత నిర్మాణ సంస్థ‌గా భావిస్తాను. కోన‌గారితో నా అనుబంధం దాదాపు 15 ఏళ్లుగా సాగుతోంది. థిల్ల‌ర్ సినిమాల‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ చాలా కీలకం, నిశ్శ‌బ్ధంలో సౌండ్ ఎలా ఉండ‌బోతుంది? నిశ్శ‌బ్ధంలో సౌండ్ గురించి నా మాట‌ల్లో చెప్పేకంటే రేపు సినిమా రిలీజయ్యాక ప్రేక్ష‌కులు వారి అనుభ‌వం ద్వారా అద్భుత‌మైన ఫీడ్‌బ్యాక్ ఇస్తార‌ని నేను క‌చ్ఛితంగా న‌మ్ముతున్నాను. సినిమాటోగ్రాఫ‌ర్ షానీల్ డియో అందించిన అద్భుత‌మైన విజువ‌ల్స్‌తో మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ గిర‌ష్, గోపీసుంద‌ర్ ఇచ్చిన నేప‌థ్య సంగీతం పోటీ ప‌డతాయి. మా సినిమాతో గోపీసుంద‌ర్ త‌న కెరీర్‌లో తొలిసారిగా ఓ థ్రిల్ల‌ర్ కి నేప‌థ్య సంగీతాన్ని అందించారు. అమెజాన్ ప్రైమ్‌లో నిశ్శ‌బ్ధం విడుద‌ల‌వ్వ‌డం గురించి ఏం చెబుతారు క‌రోనా నేప‌థ్యంలో థియేట‌ర్స్ మూసి ఉన్నా ప్రేక్ష‌కుల‌కి ఎంట‌ర్‌టైన్మెంట్ ఇచ్చే మాధ్య‌మాల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కీల‌కంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. అలానే ఈ సినిమాను చూసి అమెజాన్ వారు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. ఓటీటీలు ఉన్నంత మాత్ర‌న థియేట‌ర్‌కి ఎలాంటి న‌ష్టం రాద‌ని నేను ప్ర‌గాఢంగా విశ్వ‌సిస్తున్నాను. ఇలాంటి ఆల్ట‌ర్నేట్ ఎంట‌ర్‌టైన్మెంట్ మీడియాన్ని కూడా ప్రొత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉంది. నిశ్శ‌బ్ధం గురించి ప్రేక్ష‌కుల‌కి ఏం చెబుతారు? అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబ‌ర్ 2, 2020 నుంచి ఎక్స్ క్లూజివ్‌గా నిశ్శ‌బ్ధం అందుబాటులో ఉంటుంది. ఈ సినిమాను ల్యాప్ టాప్, మోబైల్స్‌లో చూసేవారు, బెట‌ర్ ఎక్స్‌పీరియ‌న్స్ కోసం హెడ్ ఫోన్స్ లేదా ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకుని సినిమా చూడాల్సిందిగా కోరుతున్నా. అలానే సినిమాను ఫార్వ‌డ్ చేయ‌కుండా అలానే ఫ్లోలో చూస్తే థ్రిల్‌ని ఎంజాయ్ చేస్తారు.


By September 27, 2020 at 10:00AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nishabdham-director-hemant-madhukar-latest-interview/articleshow/78343550.cms

No comments