Breaking News

కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతికి కరోనా పాజిటివ్


మరో సీనియర్ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి కరోనా బారిన పడ్డారు. బీజేపీ ఫైర్ బ్రాండ్ అని తేలింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. తనతో ప్రైమరీ కాంటాక్ట్ అయిన వారంతా కరోనా టెస్టులు చేసుకోవాలని ఆమె సూచించారు. మూడు రోజుల నుంచి జ్వరం లక్షణాలున్నాయని, ఇటీవల ఉమా భారతి హిమాలయాలకు వెళ్లారు. అయితే ఆ సమయంలో కూడా కోవిడ్ -19 నిబంధనలను పాటించారని తెలిపారు. అయినా కరోనా సోకిందని ఆమె సన్నిహితులు పేర్కొన్నారు. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కరోనా బారిన పడ్డారు. మరోవైపు దేశంలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 60లక్షలకు చేరువలో కేసులు సంఖ్య ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 9,87,861 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 88,600 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. నిన్న మరో 1124 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో కరోనా మరణాల సంఖ్య కూడా 94503కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 9 లక్షల 56వేల 402గా ఉంది. Read More: ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 49లక్షల మంది డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో నిన్న ఒక్కరోజే 92వేల మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రోజువారీ పాజిటివ్‌ కేసుల కంటే కోలుకుంటున్న వారిసంఖ్య ఎక్కువగా ఉండటం ఊరట కలిగించే విషయం. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 82.46శాతంగా ఉండగా, మరణాల రేటు 1.58శాతంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.


By September 27, 2020 at 10:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bjp-leader-uma-bharti-test-positive-for-coronavirus/articleshow/78343597.cms

No comments