Breaking News

రాత్రి ఒంటరిగా పడుకుని తెల్లారేసరికి శవమై... మిస్టరీగా మారిన మహిళ హత్య


తమిళనాడులోని జిల్లాలో ఓ వివాహిత దారుణహత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెను దుండగులు గొంతు కోసి చంపేశారు. దిండివనం సమీపంలోని విళుక్కుమ్‌ గ్రామంలో మురుగన్‌, కాళియమ్మాళ్‌(55) దంపతులు నివసిస్తున్నారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మురుగన్ ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాళియమ్మాళ్‌ వారానికోసారి వెళ్లి భర్తను చూసి వస్తోంది. Also Read: ఈ క్రమంలోనే ఆదివారం చెన్నై వెళ్లి ఇంటికి తిరిగొచ్చిన ఆమె సోమవారం ఉదయం చాలాసేపటి వరకు బయటకు రాలేదు. ఇంటి బయట రక్తపు మరకలు ఉండటంతో స్థానికులు కిటికీలో నుంచి చూడగా ఆమె రక్తపు మడుగులో కనిపించింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకున్న వారే పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. Also Read:


By September 08, 2020 at 08:54AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/55-yr-old-woman-brutally-murdered-in-tamil-nadu/articleshow/77989368.cms

No comments