నల్గొండ: వితంతువుతో సహజీవనం.. పోలీసుల ఎదుటే భర్తను చితక్కొట్టిన భార్య

అగ్నిసాక్షిగా తాళికట్టిన భార్యను పట్టించుకోకుండా మరొక ఆడదానితో సహజీవనం చేస్తున్న వ్యక్తికి భార్య, బంధువులు తగిన బుద్ధి చెప్పారు. ప్రియురాలితో కలిసి ఉంటున్న ఇంటికి బంధువులు, పోలీసులతో కలిసి వెళ్లిన ఆమె అతడిని బయటకు లాగి దేహశుద్ధి చేసింది. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో ఆదివారం జరిగింది. Also Read: కనగల్ మండలం ధర్వేశిపురానికి చెందిన మాధవి అనే మహిళకు చిట్యాల మండలం ఎలికట్టకు చెందిన సాయిబాబాతో 2011లో వివాహం జరిగింది. కారు డ్రైవర్‌గా పనిచేసే సాయిబాబా.. భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మరో మహిళతో పెట్టుకున్నాడు. మూడు నెలలుగా భార్య, పిల్లలను పట్టించుకోవడం మానేసిన సాయిబాబా ప్రియురాలితో సహజీవనం చేస్తున్నాడు. Also Read: ఈ విషయం తెలుసుకున్న మాధవి నల్గొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం ఉదయం పోలీసులతో సహా వారింటికి వెళ్లి భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అందరూ చూస్తుండగానే మాధవి, ఆమె బంధువులు సాయిబాబాపై దాడికి పాల్పడి పోలీసులకు అప్పగించారు. Also Read:
By September 06, 2020 at 01:04PM
No comments