Breaking News

నల్గొండ: భార్య కోసం వచ్చి పక్కింటి బాలికతో ప్రేమాయణం.. చివరికిలా


పెళ్లయిన ఏడాదికే మరో బాలికతో ప్రేమ వ్యవహారం నడిపిన యువకుడు ఆమెతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో వెలుగుచూసింది. నకిరేకల్ మండలం గుడివాడ గ్రామానికి చెందిన రాచకొండ శ్రీనివాస్‌ అనే యువకుడికి కట్టంగూర్ మండలం అంబటి వాగుకు చెందిన యువతితో ఏడాది క్రితం వివాహమైంది. అత్తగారింటికి రాకపోకలు సాగించే క్రమంలో అతడికి పక్కింట్లో ఉండే మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. Also Read: మాయమాటలతో బాలికను ప్రేమ ముగ్గులోకి దించిన శ్రీనివాస్ ఆమెతో షికార్లు చేసేశాడు. ఈ విషయం రెండు కుటుంబాల్లో తెలియడంతో పెద్ద గొడవ జరిగింది. దీంతో తాము కలిసి బ్రతకడం కుదరకపోవడంతో కలిసి చనిపోవాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం బొప్పారం గ్రామ శివారులోని వ్యవసాయం పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. Also Read:


By September 09, 2020 at 10:11AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/love-couple-commits-suicide-in-nalgonda-district/articleshow/78009704.cms

No comments