ఇష్టం లేని భార్యతో ఉండలేక.. ప్రియురాలితో కలిసి యువకుడి ఆత్మహత్య

ప్రేమించిన యువతితో కాకుండా తన ఇష్టానికి వ్యతిరేకంగా మరో అమ్మాయితో పెద్దలు పెళ్లి చేయించడాన్ని ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు. ప్రియురాలి లేని జీవితం వ్యర్థమనుకుని ఆమెతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలో జరిగింది. క్రిష్ణగిరి జిల్లా వేపనపల్లి సమీపంలోని కే. కొత్తూరు గ్రామానికి చెందిన సురేష్(24) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బొమ్మరసనపల్లి గ్రామానికి చెందిన బాలరాజ్ కూతురు భవాని(18)ని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. భవానీకి కూడా సురేష్ అంటే ప్రాణం. Also Read: ఈ విషయం తెలుసుకున్న సురేష్ కుటుంబసభ్యులు వీరి ప్రేమకు అడ్డుచెప్పారు. సురేష్ బెదిరించి నాలుగు నెలల క్రితం మరో యువతితో బలవంతంగా పెళ్లి చేశారు. అయితే ప్రేమించిన వ్యక్తితో జీవితం పంచుకోలేకపోయానన్న బాధతో సురేష్ డిప్రెషన్ గురయ్యాడు. ప్రేయసిలేని జీవితం తనకొద్దని నిర్ణయించుకున్నాడు. రెండ్రోజుల క్రితం భవానీని కలిసి మాట్లాడగా ఆమె కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. కలిసి బ్రతకడం కుదరనప్పుడు కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నారు. Also Read: మూడు రోజుల క్రితం ఇద్దరూ ఇళ్ల నుంచి పారిపోయారు. హోసూరు– క్రిష్ణగిరి జాతీయ రహదారి సమీపంలోని కుందారపల్లి వద్ద సోమవారం పురుగుల మందు తాగారు. వీరిని గమనించిన స్థానికులు క్రిష్ణగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో భవానీ మంగళవారం ఉదయం ప్రాణాలు కోల్పోయింది. సురేష్‌ను మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలింస్తుడగా మంగళవారం రాత్రి చనిపోయాడు. ఈ ఘటనపై క్రిష్ణగిరి తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By September 03, 2020 at 07:44AM
No comments