Breaking News

పార్కులో హీరోయిన్‌పై దాడి.. పబ్లిక్‌‌గానే టాప్ తీసి చూపిస్తూ ఫైర్! జరిగింది ఇదీ అంటూ రెచ్చిపోయిన బ్యూటీ


కొన్ని సందర్భాల్లో సెలబ్రెటీలకు ఊహించని ఘటనలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు సెడెన్‌గా చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇక ఈ కష్టం హీరోయిన్లకైతే మరీ ఎక్కువ. పబ్లిక్‌గా హీరోయిన్ కనిపిస్తే చాలు.. ఆమెను తాకడానికో, లేక మాట్లాడటానికో తెగ ప్రయత్నం చేస్తుంటారు ఆడియన్స్. తాజాగా హీరోయిన్ సంయుక్త హెగ్డేకి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఏదో కాసేపు వర్కవుట్స్ చేసుకుందామని పార్క్‌కి వెళితే అక్కడ ఊహించని షాక్ తగిలింది. కొంతమంది ఆమెపై దాడి చేయడం కలకలం సృష్టిస్తోంది. ఈ దాడికి కారణం హీరోయిన్ .. స్పోర్ట్స్‌వేర్ వేసుకోవడమేనని తెలుస్తోంది. బెంగ‌ళూరులోని ఓ పార్కులో స్పోర్ట్స్ బ్రా వేసుకుని పార్కులో డాన్స్‌, వ‌ర్క‌వుట్స్ చేస్తోంది సంయుక్త. అయితే ఆ స‌మయంలో అక్క‌డున్న‌న క‌వితా రెడ్డి అనే మ‌హిళ సంయుక్త‌పై దాడి చేసింది. అంతేకాదు ఆ మ‌హిళకు అక్క‌డే ఉన్న కొంత మంది ప‌బ్లిక్ కూడా సపోర్ట్ చేస్తూ సంయుక్తపై దుర్భాషలాడారు. ప‌బ్లిక్‌లో స్పోర్ట్స్ బ్రా వేసుకుని తిర‌గ‌డంతో పాటు మీ లాంటి నటులంతా డ్ర‌గ్స్ వాడతారంటూ ఆమెపై దాడి చేశారు. Also Read: దీంతో కోపంతో ఊగిపోయిన సంయుక్త ఓ సెల్ఫీ వీడియోలో అసలు విషయం చెబుతూ ఫైర్ అయింది. తాను వర్కవుట్ చేయడానికి వేసుకున్న లో- దుస్తులను పబ్లిక్‌‌గానే టాప్ తీసి చూపిస్తూ రెచ్చిపోయింది. దాడి చేసిన మహిళతో పాటు ఆమెకు సపోర్ట్ చేసిన వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకే కొందరు ఈ ప్రయత్నం చేస్తున్నారంటూ ఆవేదన చెందింది. దీంతో ఆమె పోస్ట్ చేసిన ఈ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా డ్రగ్స్ కేసు నేపథ్యంలో కర్నాటకలో నిరసన కార్యక్రమాలు జరుగుతుండగా, సంయుక్త అక్కడికి రావడం మూలంగానే ఈ దాడి జరిగిందని సోషల్ మీడియాలో మరొకొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. ఇకపోతే.. తెలుగులో నాగార్జున‌తో మ‌న్మ‌థుడు 2 మూవీ, యంగ్ హీరో నిఖిల్‌తో కిర్రాక్ పార్టీ వంటి చిత్రాల‌తో పాటు ప‌లు త‌మిళ సినిమాల్లో నటించి ఫేమ్ సంపాదించింది సంయుక్త హెగ్డే.


By September 06, 2020 at 10:30AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/attack-on-heroine-samyuktha-hegde-in-public-park/articleshow/77957985.cms

No comments