ర్యాష్ డ్రైవింగ్‌కు ప్రాణం బలి.. వాచ్‌మెన్‌ని కారుతో గుద్దేసి ఇంటికెళ్లి పడుకున్న యువతి

యువతి నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలిగొనడమే కాకుండా ఆమెను జైలుపాలు చేసిన ఘటన రాజధాని నగరంలో వెలుగుచూసింది. చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్‌కు శివప్రకాశం(68) అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి అతడు సెల్లార్ నిద్రపోతుండగా ఓ ఫ్లాట్‌లో ఉండే యువతి(18) కారులో వేగంగా వచ్చింది. వాచ్‌మెన్‌ను చూసుకోకుండా కారుతో తొక్కించేసి తన ఫ్లాట్కి వెళ్లి పడుకుంది. Also Read: మరుసటి రోజు ఉదయం విగతజీవిగా పడివున్న శివప్రకాశాన్ని చూసిన అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ పుటేజీని పరిశీలించగా యువతి అతడిపై నుంచి కారు నడుపుకుంటూ వెళ్లడం స్పష్టంగా రికార్డ్ అయింది. కారు నంబర్ ఆధారంగా యువతిని గుర్తించిన పోలీసులు ఆమెను ప్రశ్నించగా తనకేమీ తెలియదని చెప్పింది. వారు సీసీటీవీ పుటేజీ చూపించడంతో ఆమె షాకైంది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. Also Read:
By September 06, 2020 at 10:43AM
No comments