Breaking News

రాజీ అని చేయిచాచి.. కత్తితో పొడిచి చంపేశాడు.. నెల్లూరులో నమ్మకద్రోహం


నెల్లూరుకి చెందిన రౌడీషీటర్ బిర్యాని బాషా అలియాస్ బాషా(32) హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యర్థులు పథకం ప్రకారమే కలసి మద్యం తాగి.. అదనుచూసి అమానుషంగా అంతమొందించినట్లు తెలుస్తోంది. బాషాని హత్య చేయాలని నిర్ణయించుకున్న ప్రత్యర్థి రౌడీషీటర్ పక్కా ప్లాన్ ప్రకారం పని పూర్తి చేసినట్లు అనుమానిస్తున్నారు. గొడవలొద్దంటూ స్నేహ హస్తం అందించినట్టే చేయిచాచి అమానుషంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. నగరంలోని సీఏఎం హైస్కూల్ ఏరియాకి చెందిన బిర్యాని బాషా వంట పనులు చేస్తుంటాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు సంతానం. బాషాకి పలువురితో గొడవలు ఉండడంతో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నేరప్రవర్తన కారణంగా అతనిపై పోలీసులు రౌడీషీట్ తెరిచారు. కొద్దికాలం కిందట ఓ మహిళ విషయమై కోటమిట్ట ప్రాంతానికి చెందిన మరో రౌడీషీటర్ మొహిసీన్‌తో బాషా గొడవపడ్డాడు. బాషా చేయిచేసుకోవడంతో మొహిసీన్ మనసులో పెట్టుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సడెన్‌గా స్నేహ హస్తం.. వారం రోజుల కిందట సడెన్‌గా మొహిసీన్ గొడవలు వద్దంటూ బాషాతో రాజీ కుదుర్చుకున్నాడు. ఇకనుంచి కలిసి ఉందామంటూ స్నేహ హస్తం అందించాడు. ప్రత్యర్థి కుట్రని పసిగట్టలేకపోయిన బాషా కలిసిపోయాడు. ఇద్దరూ కలిసిపోయిన సంతోషంలో అప్పటి నుంచి రెండు వర్గాలు కలిసి మందుపార్టీలు చేసుకుంటున్నారు. అర్ధరాత్రి వరకూ మాట్లాడుకుని వెళ్లేవారు. మూడు రోజుల నుంచి ఇంటికి సమీపంలోని ఓ షెడ్డులో బాషా, మొహిసీన్, అతని అనుచరులు మద్యం తాగుతున్నారు. రెండు రోజుల కిందట మరోమారు అందరూ మందుపార్టీ చేసుకున్నారు. అదను చూసి అంతం చేసేశారు.. మొహిసీన్ అనుచరులు జాన్సన్, సమీర్, ఫరూఖ్, ప్రేమ్‌తో పాటు బాషా, అతని అనుచరుడు కార్తీక్ మద్యం తాగారు. సిగరెట్లు తెచ్చేందుకు కార్తీక్ బయటికి వెళ్లాడు. అదే సమయంలో ఇంటికి వెళ్లి వాటర్ బాటిళ్లు తీసుకుని వచ్చాడు బాషా. అనుచరులు లేకపోవడం.. బాషా కుటుంబ సభ్యులు తలుపులు వేసుకుని లోపల ఉండడం గమనించి అదే అదనుగా ఒక్కసారిగా ప్రత్యర్థులు కత్తులతో దాడికి దిగారు. ఒంటరిగా ఉన్న బాషాపై కత్తులతో విచక్షణా రహితంగా నరికేశారు. బాషా కేకలు విన్న కుటుంబ సభ్యులు బయటికొచ్చి చూసేలోగా దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. Also Read: ప్రత్యర్థుల దాడిలో తీవ్రగాయాలపాలైన బాషా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు మొహిసీన్, అతని అనుచరులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హత్యానంతరం నిందితులు పరారయ్యారు. కుటుంబ సభ్యులతో సహా నిందితులు పరారైనట్లు తెలుస్తోంది. హత్య, ఆ తరువాత పరారీ.. అంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. Read Also:


By September 19, 2020 at 02:04PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-murdered-brutally-on-pretext-of-compromise-in-nellore/articleshow/78201958.cms

No comments