అనంతపురంలో దారుణం.. ఆడుకుంటున్న బాలికను ఎత్తుకెళ్లి..

నగర శివారులో దారుణం జరిగింది. అక్కంపల్లి ధర్మబిక్షం కాలనీకి చెందిన బాలికతో అదే ప్రాంతానికి చెందిన బాషా(50) అనుచితంగా ప్రవర్తించాడు. కామంతో కళ్లుమూసుకుపోయి అభం శుభం తెలియని చిన్నారిపై నీచానికి పాల్పడ్డాడు. తమ్ముడితో కలసి ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి దూరంగా తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడి చేసేందుకు యత్నించాడు. బిత్తరపోయిన బాలిక పెద్దగా కేకలు వేసింది. కూతురి కేకలు విన్న తల్లి అటువైపు రావడంతో బాషా అక్కడి నుంచి పరారయ్యాడు. చిన్నారిపై అత్యాచార యత్నం చేసిన మృగాడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By September 19, 2020 at 09:47AM
No comments