మద్యం మత్తులో విచక్షణ మరిచిన కొడుకు.. క్రికెట్ బ్యాట్‌తో తల్లిపై దాడి

మద్యం మత్తులో విచక్షణ మరిచిపోయిన ఓ యువకుడు కన్నతల్లిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టిన ఘటన జిల్లా మండలంలో జరిగింది. మందడం గ్రామానికి చెందిన గుంజి వెంకటేశ్వరరావు అనే యువకుడు బుధవారం నీటి విషయంలో పక్కింటి వారితో వాగ్వాదానికి దిగాడు. రెండు వర్గాల మధ్య గొడవ పెరగడంతో చుట్టుపక్కల వారు గుమిగూడారు. Also Read: దీంతో కంగారుపడిన వెంకటేశ్వరరావు తల్లి జయమ్మ గొడవ వద్దంటూ కొడుకును అడ్డుకోబోయింది. మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్వరరావు విచక్షణ మరిచి క్రికెట్ బ్యాట్‌తో తల్లి తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావమైన జయమ్మను స్థానికులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై విచారణ చేపట్టి పోలీసులు వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By September 03, 2020 at 11:14AM
No comments