Breaking News

తుళ్లూరు: బావతో అక్రమ సంబంధం, భర్తను చంపేసి ఆత్మహత్యగా నాటకం


తన అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్న భర్తను సోదరుడితో కలిసి దారుణంగా చంపేసిందో ఇల్లాలు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే మరో హత్య ఉదంతం బయటపడింది. దీంతో పోలీసులు నలుగురు సభ్యుల ముఠాను జిల్లా మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళగిరి మండలం నవులూరుకు చెందిన పారబత్తిన దుర్గాప్రసన్న సెంట్రింగ్‌ పని చేస్తుంటాడు. ఈ క్రమంలోనే తన తమ్ముడు సీతారామాంజనేయులు (27) భార్య లక్ష్మితో అతడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తాను లేని సమయంలో అన్న తరుచూ ఇంటికి వస్తున్నాడని తెలుసుకున్న సీతారామాంజనేయులు తరుచూ మద్యం తాగొచ్చి భార్యను వేధిస్తున్నాడు. Also Read: దీంతో భర్త అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో సంతోషంగా ఉండొచ్చని లక్ష్మీ పధకం వేసింది. ఆగస్టు 21 రాత్రి సీతారామాంజనేయులును నవులూరు క్రికెట్‌ స్టేడియం వెనక్కి రప్పించిన దుర్గాప్రసన్న.. తన స్నేహితులు తోడేటి నాగరాజు, పసుపులేటి హరికృష్ణలతో కలిసి దాడి చేసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. శవాన్ని కండువాతో తుమ్మచెట్టుకు వేలాడ తీసి.. కరోనా భయంతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులను నమ్మించడానికి సంఘటనా స్థలంలో మందులు, మాస్కులు, చేతి గ్లౌజులు పడేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మంగళగిరి రూరల్‌ సీఐ శేషగిరిరావు కేసు దర్యాప్తు చేపట్టారు. Also Read: ఈ క్రమంలోనే సీతారామాంజనేయులుది ఆత్మహత్య కాదని, హత్య అన్న అనుమానం పోలీసులకు కలిగింది. సంఘటనా స్థలంలో లభించిన మృతుడి ఆధార్‌కార్డు ఆధారంగా అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారా? కరోనా వచ్చినట్లు తేలిందా? అనే కోణంలో విచారించారు. ప్రభుత్వ రికార్డుల్లో అతడికి కరోనా లేదని తేలింది. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా మృతుడి భార్య లక్ష్మికి, అతడి సోదరుడు దుర్గాప్రసన్నకు మధ్య కొనసాగుతున్న అక్రమ సంబంధం బయటకు వచ్చింది. వారిద్దరు స్నేహితులతో కలిసి సీతారామాంజనేయులును హత్య చేసినట్లు విచారణలో తేల్చారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలోనే పోలీసులకు మరో హత్య గుర్తించి తెలిసింది. Also Read: దుర్గాప్రసన్న స్నేహితుడు తోడేటి నాగరాజుకు పిడుగురాళ్లకు చెందిన చిన్నాతో పరిచయం ఉంది. ఈ క్రమంలోనే నాగరాజు భార్యకు చిన్నా తమ్ముడు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఈ విషయం తెలుసుకున్న నాగరాజు అతడితో గొడవపడ్డాడు. తన సోదరుడిని నిలదీసినందుకు ఆవేశానికి గురైన చిన్నా.. చంపేస్తానంటూ నాగరాజును బెదిరించాడు. దీంతో చిన్నాతో తనకు ప్రాణహాని ఉందని భావించిన నాగరాజు ఆగస్టు 18న నల్లపాడులోని ఓ అపార్టుమెంట్‌లో పనికి వెళ్లిన సమయంలో సీతారామాంజనేయులుతో కలిసి చిన్నాను మర్మాంగాలపై కొట్టి హతమార్చారు. అయితే తాను హత్య చేసిన సంగతి సీతారామాంజనేయులు ఎప్పటికైనా బయటపెడతాడన్న అనుమానంతో నాగరాజుకు అతడి హత్యలో పాలుపంచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. Also Read:


By September 03, 2020 at 10:38AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-kills-husband-over-illegal-affair-with-brother-in-law-in-guntur-district/articleshow/77904345.cms

No comments